Hero Suman: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో సుమన్ గురించి అందరికీ సుపరిచితమే. ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవికి పోటీగా సినిమాలలో నటించిన సుమన్ కొన్ని కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈయన ఎన్నో సినిమాలలో సహాయ నటుడు పాత్రలలో నటించి మెప్పించారు.
ఇకపోతే తాజాగా సుమన్ జయహో రామానుజ అనే సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుమన్ ట్రైలర్ లాక్ చేసిన అనంతరం మాట్లాడుతూ సినిమాల గురించి పది ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే సుమన్ ఎన్నో సినిమాలలో ఆధ్యాత్మిక పాత్రలలో నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ సందర్భంగా ఆ పాత్రల గురించి మాట్లాడుతూ దేవుడి పాత్రలలో నటించాలి అంటే డబ్బు పలుకబడి ఉంటేనే అలాంటి పాత్రలలో నటించే అవకాశం రాదని, అలాంటి పాత్రలలో నటించే అవకాశం రావాలంటే ఆ భగవంతుడి అనుమతి కూడా కావాలని తెలిపారు. ఇలా భగవంతుడి ఆశీర్వాదాలు మనపై ఉంటేనే మనకు దేవుడి పాత్రలలో నటించే అవకాశాలు వస్తాయని తెలిపారు.
అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించడానికి ఎంతో మందిని సంప్రదించారు. అయితే ఆ పాత్రలో నటించే అవకాశం తనకు వచ్చిందని ఈయన గుర్తు చేసుకున్నారు.వెంకటేశ్వర స్వామి నా పాత్రలో ఈయనే నటించాలని ఆయన ఆశీర్వాదాలు ఆయన అనుమతి నాకు తెలపడం వల్లే తనకు అలాంటి అద్భుతమైన పాత్రలో నటించే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా సుమన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…