Actor Ajay: రేప్ సీన్ అని చెప్పకుండా అమ్మాయిని తీసుకోచ్చారు.. నేను పట్టుకోగానే ఒకటే ఏడుపు.. ఇక వెంటనే : నటుడు అజయ్

Actor Ajay: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో అజయ్ కూడా ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించి విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కడు, సింహాద్రి, దేశముదురు, సై, విక్రమార్కుడు వంటి పలు హిట్ చిత్రాలలో నటించిన అజయ్ ఈ మధ్యకాలంలో సినిమాలలో తక్కువగా కనిపిస్తున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా అజయ్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అజయ్ ఇండస్ట్రీలో నటన గురించి మాట్లాడుతూ.. “సినిమాలో మనిషి ఎన్ని సీన్లు ఉన్నాయన్నది కాకుండా.. మనం నెక్స్ట్ లెవెల్ కి ఎలా వెళ్లాలి అన్నది మాత్రమే చూసుకోవాలి. ఇండస్ట్రీలో కూడా డిమాండ్ అండ్ సప్లయ్ పాలసీ నడుస్తోంది.

Actor Ajay: రేప్ సీన్ అని చెప్పకుండా అమ్మాయిని తీసుకోచ్చారు.. నేను పట్టుకోగానే ఒకటే ఏడుపు: నటుడు అజయ్

గత 18 ఏళ్లుగా నాకు ఇండస్ట్రీలో పని ఉన్నప్పటికీ నాణ్యమైన పనిచేయడం కోసం నేను ఎప్పుడూ ఆసక్తి చూపుతాను. సినిమాలో ఏదో ఉన్నాను, వెళ్లాను అన్నట్టుగా కాకుండా నాకు గుర్తింపు తెచ్చే పాత్ర కోసమే ట్రై చేస్తాను.అలా కుదరకపోతే ఇంట్లో కూర్చుని వేరే పని చేసుకోవడానికి కూడా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను”అని అజయ్ చెప్పుకొచ్చారు.

ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనిపించకపోవటం గురించి మాట్లాడుతూ..” స్క్రిప్టులో నాకు తగ్గ పాత్ర లేకపోవడం వల్లే నేను సినిమాలు చేయడం లేదు. అంతకుమించి మరే కారణం లేదు” అని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీ లో విలన్ గా చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ క్రమంలో ఒక్కోసారి దెబ్బలు కూడా తగులుతాయి. 19 ఏళ్ల వయసులో ఫ్రెండ్ తో కలిసి ఇంట్లో నుండి పారిపోయి రెండు మూడు నెలలు నేపాల్ లో ఉన్నాను.తిరిగి రావటానికి డబ్బు లేకపోవడంతో ఒక హోటల్లో గిన్నెలు కడిగి డబ్బులు తీసుకొని తిరిగి ఇంటికి వచ్చాను అని చెప్పుకొచ్చాడు.

నేను చెయ్యనని చెప్పేసా….

ఇక సినిమాలలో జరిగే కొన్ని రేప్ సీన్లు గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మహాలక్ష్మి అనే సినిమా చేసే సమయంలో ఒక మోడల్ కు రేప్ సీన్ సంగతి గురించి చెప్పకుండా ఆమెను తీసుకు వచ్చారు. రేప్ సీన్ స్టార్ట్ అవ్వగానే నేను ఆ అమ్మాయిని పట్టుకున్నా అంతే ఆమె గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. దీంతో నా వల్ల కాదు సార్ నేను ఈ సీన్ చేయలేను అని చెప్పేశా. వందలమంది ముందు అలా రేప్ సీన్ చేయటం చాలా చిరాకుగా ఉంటుంది. దేవుడి దయవల్ల ఇప్పటి వరకు నాకు అలాంటి రేప్ సీన్లు రాలేదు. ఈ విషయంలో నాకు చాలా సంతోషం అని చెప్పుకొచ్చారు.