Actor Ajay: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో అజయ్ కూడా ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించి విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కడు, సింహాద్రి, దేశముదురు, సై, విక్రమార్కుడు వంటి పలు హిట్ చిత్రాలలో నటించిన అజయ్ ఈ మధ్యకాలంలో సినిమాలలో తక్కువగా కనిపిస్తున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా అజయ్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అజయ్ ఇండస్ట్రీలో నటన గురించి మాట్లాడుతూ.. “సినిమాలో మనిషి ఎన్ని సీన్లు ఉన్నాయన్నది కాకుండా.. మనం నెక్స్ట్ లెవెల్ కి ఎలా వెళ్లాలి అన్నది మాత్రమే చూసుకోవాలి. ఇండస్ట్రీలో కూడా డిమాండ్ అండ్ సప్లయ్ పాలసీ నడుస్తోంది.
గత 18 ఏళ్లుగా నాకు ఇండస్ట్రీలో పని ఉన్నప్పటికీ నాణ్యమైన పనిచేయడం కోసం నేను ఎప్పుడూ ఆసక్తి చూపుతాను. సినిమాలో ఏదో ఉన్నాను, వెళ్లాను అన్నట్టుగా కాకుండా నాకు గుర్తింపు తెచ్చే పాత్ర కోసమే ట్రై చేస్తాను.అలా కుదరకపోతే ఇంట్లో కూర్చుని వేరే పని చేసుకోవడానికి కూడా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను”అని అజయ్ చెప్పుకొచ్చారు.
ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనిపించకపోవటం గురించి మాట్లాడుతూ..” స్క్రిప్టులో నాకు తగ్గ పాత్ర లేకపోవడం వల్లే నేను సినిమాలు చేయడం లేదు. అంతకుమించి మరే కారణం లేదు” అని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీ లో విలన్ గా చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ క్రమంలో ఒక్కోసారి దెబ్బలు కూడా తగులుతాయి. 19 ఏళ్ల వయసులో ఫ్రెండ్ తో కలిసి ఇంట్లో నుండి పారిపోయి రెండు మూడు నెలలు నేపాల్ లో ఉన్నాను.తిరిగి రావటానికి డబ్బు లేకపోవడంతో ఒక హోటల్లో గిన్నెలు కడిగి డబ్బులు తీసుకొని తిరిగి ఇంటికి వచ్చాను అని చెప్పుకొచ్చాడు.
ఇక సినిమాలలో జరిగే కొన్ని రేప్ సీన్లు గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మహాలక్ష్మి అనే సినిమా చేసే సమయంలో ఒక మోడల్ కు రేప్ సీన్ సంగతి గురించి చెప్పకుండా ఆమెను తీసుకు వచ్చారు. రేప్ సీన్ స్టార్ట్ అవ్వగానే నేను ఆ అమ్మాయిని పట్టుకున్నా అంతే ఆమె గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. దీంతో నా వల్ల కాదు సార్ నేను ఈ సీన్ చేయలేను అని చెప్పేశా. వందలమంది ముందు అలా రేప్ సీన్ చేయటం చాలా చిరాకుగా ఉంటుంది. దేవుడి దయవల్ల ఇప్పటి వరకు నాకు అలాంటి రేప్ సీన్లు రాలేదు. ఈ విషయంలో నాకు చాలా సంతోషం అని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…