Featured

Prashanth Neel : కేజీఎఫ్ 2 తో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ప్రశాంత్ నీల్ గురించే… నిశ్శబ్దంలో వచ్చిన ఈ తూఫాన్ కథేంటో….!

Prashanth Neel background : చేసింది మూడు సినిమాలే అయినా రెండో సినిమాకే ఇండియా మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అప్పటి వరకూ బాలీవుడ్ డామినేషన్ చూసిన ఇండియన్ సినిమా మొదటిసారి అసలైన పాన్ ఇండియా సినిమా చూసింది. సౌత్ ఇండస్ట్రీ సత్తాని ముంబైలో మాట్లాడుకునేలా చేసింది ప్రశాంత్ నీలే . శాంతి నేను తీసిన సినిమాల సంఖ్య చిన్నదే అయినా తాను అడుగు పెట్టిన తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీ మార్కెట్ పెద్దదయింది.

ప్రశాంత్ నీల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి…..

ప్రశాంత్ నీల్ కర్ణాటక లోని హసన్ జిల్లా వాసి. చిన్నప్పటి నుండి సినిమాలవైపు రావాలనో డైరెక్టర్ అవ్వాలనో కలలు కనలేదు . బుద్దిగా చదువుకొని మంచి ఉద్యోగం లో స్థిరపడ్డాడు. ఇంట్లోని పరిస్థితులు అవస్థలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్ అయ్యాక ఉద్యోగంలో చేరాడు.కానీ “అంతా డబ్బు ఉంటే హాయిగా బతకొచ్చు అనుకుంటారు. కానీ.., డబ్బు లేకుంటే చావు కూడా ప్రశాంతంగా అవ్వదు” అని ప్రశాంత్ నీల్ అప్పుడే ఆలోచించాడు. అందుకే సినిమాల్లోకి వెళ్లాలని అనుకుని డైరెక్టర్ కోర్స్ చేసి కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. ఎన్నో ఆశలతో వచ్చిన ప్రశాంత్ కు కన్నడ ఇండస్ట్రీ చాలా చిన్నదనే విషయం తెలియదు.

ఇక ఉగ్రమ్ సినిమా తీసాడు కాని విడుదలకు బాగా కష్టాలు పడ్డాడు, నిర్మాతలు విడుదల సమయంలో చేతులు ఎత్తేయడంతో ఉగ్రమ్ విడుదల ఆగిపోయింది. ఇక ఎపుడు కన్నడ సూపర్ హీరో దర్శన్ సహాయంతో సినిమాను విడుదల చేసారు ప్రశాంత్ నీల్ 2014 ఫిబ్రవరి 21న ‘ఉగ్రమ్’ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఉగ్రమ్ విడుదలైన రోజు రెండు సంఘటనలు జరిగాయి. దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పుట్టాడు. అతని రాకతో కన్నడ సినీ ఇండస్ట్రీ మళ్ళీ కొత్తపుంతలు తొక్కింది.ఉగ్రమ్ సినిమా కాసుల వర్షం కురిపించింది.

ఇక కన్నడ సినీ ఇండస్ట్రీ చాలా చిన్నదని అర్థమైన ప్రశాంత తన నెక్స్ట్ సినిమాతో బాలీవుడ్ లో తన పేరు వినపడేలా చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కేజీఎఫ్ ఆ కలను నెరవేర్చడం కాదు… కేజీఎఫ్ తో ప్రశాంత్ ఎవరని ఆరా తీసేలా చేసుకున్నాడు. పాన్ ఇండియా సినిమా అర్థం చెప్పాడు. కన్నడ హీరోను పాన్ ఇండియా స్టార్ ని చేసాడు. ఒక్క మాతృ భాష కన్నడ లోనే 250 కోట్లు వసూలు చేసి కన్నడ మార్కెట్ ను పెంచేసింది కేజీఎఫ్. “పవర్ ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్”. ఏదో కేజీఎఫ్ డైలాగ్ కానీ ప్రశాంత్ మాత్రం తానొచ్చిన ప్లేసులో ను పవర్ ఫుల్ చేసాడు. కానీ కేజీఎఫ్ గాలివాటు గా వచ్చిన విజయం కాదు దానికోసం ప్రశాంత్ చాలా కష్టపడ్డాడు. ప్రశాంత్ తన సినిమా ప్రొమోషన్స్ కోసం జక్కన్న ను కలవాలని అనుకున్నాడు.

అయితే యష్, ప్రశాంత్ కు అనుకోకుండా ఎయిర్ పోర్ట్ లో రాజమౌళి కనిపించడంతో యష్ తనను తాను పరిచయం చేసుకుని సినిమా గురించి ప్రశాంత్ గురించి చెప్పాడు కానీ రాజమౌళికి అవేవి వినిపించలేదు. కేవలం ప్రశాంత్ అన్న పాన్ ఇండియన్ మూవీ అన్నది మాత్రమే వినిపించింది. ఇక 15నిమిషాల యాక్షన్ సన్నివేశాలను చూపిస్తూ ప్రశాంత్ రాజమౌళికి అవేమి వినిపించలేదు కేవలం ఆ సన్నివేశాల్లో మునిగిపోయారు. అంతే ఇక కేజీఎఫ్ నచ్చడంతో రాజమౌళి ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఆయన మదిలో ఉన్నా పాన్ ఇండియా కల ఇలా నెరవేర్చాలని డిసైడ్ అయ్యారు.

2018 డిశెంబర్ 21న కె.జి.యఫ్‌ ప్రేక్షుకుల ముందకు వచ్చింది. సినిమా చూసిన వారంతా మౌనంగా ఉండిపోయారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలలో మాత్రమే కాకుండా, బాలీవుడ్ లో కూడా కేజీఎఫ్ ప్రభంజనం సృష్టించింది. ఇక ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 సక్సెస్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా తూఫాన్ కాదు ఏకంగా సునామి సృష్టిస్తోంది. రికార్డులు బద్దలుకొడుతోంది. ఎక్కడైనా సినిమాలో హీరో ఎలివేషన్ ఉంటుంది కానీ హీరో ఎలివేషన్ లో సినిమా కథని చూపించాడు ప్రశాంత్ నీల్ ఇక ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాడు. ఇక కేజీఎఫ్ ఫ్రాంచైస్ తో ప్రశాంత్ నీల్ బాలీవుడ్ డామినేషన్ ను అణచడానికి వచ్చిన మరో రాజమౌళిల కనిపిస్తున్నాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago