Actor Banerjee : మెగాస్టార్ బయోపిక్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన నటుడు బెనర్జీ…

Actor Banerjee : తెలుగు సినీ పరిశ్రమలో దశబ్దాలుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు బెనర్జీ. సహాయ పాత్రలలోనూ, విలన్ పాత్రలతోనూ అందరినీ మెప్పిస్తున్నాడు. ఇప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా వున్నారు. త్వరలో విడుదల కానున్న రాణా సినిమా విరాటపర్వం సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించునున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న బెనర్జీ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

బెనర్జీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. నాన్న గారు సినీ పరిశ్రమలో ఉండటం వల్ల నాకు సినిమా రంగానికి చెందిన వాళ్లు పరిచయం అయ్యారని చెప్పారు. ఇక త్వరలో విడుదల కానున్న తన సినిమా విరాటపర్వం మంచి సినిమా అని, ఇది కాకుండా కొత్తవాళ్లతో కలసి మూడు సినిమాలు చస్తున్నానని తెలియజేశారు. తన బాల్యం గురించి చెబుతూ ఢిల్లీలో తన బాల్యం, బెజవాడలో సెకండరి స్కూల్ గడిచిందని చెప్పారు. తాను చేసిన సినిమాలలో గాయం, జైత్రయాత్ర, నువ్వు నేను సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయని చెప్పారు. నాన్న సినిమాలలో ఆర్టిస్ట్ కనుక భరత్ అను నేను సినిమాల్లో ఇద్దరం కలసి నటించామని తెలియజేసారు.

చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలు…..

నటుడు బెనర్జీ చిరంజీవి గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పారు. హీరో చిరంజీవి మంచి హ్యూమన్ బీయింగ్ అని, నటన పరంగా ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి అని చెప్పారు. అంతేకాకుండా ఆయన చేసిన కొన్ని సేవలు మాత్రమే బయటకు తెలుస్తాయని ఆయన చేసిన వాటిలో చాలా సేవలు ఎవరికీ తెలియవని చెప్పుకొచ్చారు. కరోనా సమయం లో చాలామంది ఆయన నుంచి సహాయం పొందారని చెప్పారు. మెగా స్టార్ బయోపిక్ గురించి మాట్లాడుతూ… చిరంజీవి కెరీర్ ను ఒక సినిమాగా తీస్తే చాలా బాగుంటుంది అని చెప్పానే తప్ప నేను తీస్తానని ఎపుడు చెప్పలేదని ఆయన తెలియజేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా వీలైనంత వరకు సేవ చేసే అవకాశం లభించిందని ఆయన చెప్పారు. నాదృష్టిలో మాత్రం సమానత్వం వుండి తీరాలని అందరినీ ఒకేలా గౌరవంతో చూడాలని తెలియజేసారు.