Featured

Nayanatara : ఆకట్టుకుంటున్న నయనతార, విగ్నేష్ శివన్ ల పెళ్లి ఆహ్వాన వీడియో… రేపు పెళ్లి చేసుకోబోతున్న నయన్, శివన్…!

Nayanatara : ఎట్టకేలకు నయనతార పెళ్లిచేసుకోబోతోంది. శింబుతో ప్రేమాయణంతో రచ్చ చేసిన నయన ఆ తరువాత డాన్స్ మాస్టర్ మరియు హీరో అయిన ప్రభూ దేవాతో ప్రేమలో మునిగితేలింది. ఇక వీళ్లిదరూ పెళ్లి చేసుకుంటారని పక్కాగా ఫిక్స్ అయ్యారు అందరూ. కానీ కారణాలు స్పష్టంగా తెలియక పోయినా ఆ ప్రేమా కూడా బ్రేక్ అప్ అయిపోయింది.

నయన్ విగ్నేష్ ల పెళ్లి ఆహ్వానం….

ఇక ప్రభుదేవా ఎపిసోడ్ తరువాత ఈ కేరళ కుట్టి చాలా మారిపోయింది. జీరో సైజు అంటూ సన్నబడి కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటి తరం హీరోయిన్లలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హిట్లు కొట్టిన హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తమిళ హీరోలకు ధీటుగా స్టార్ డమ్ ను సొంతం చేసుకుని లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఇక అమ్మడు మరోసారి ప్రేమలో పడింది. ఈ సారి హీరోతో కాదు దర్శకుడితో. నయనతార నటించిన నేను రౌడీనే సినిమా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. విగ్నేష్ శివన్, నయనతార కంటే ఏడాది చిన్నవాడు. వీరిద్దరి పెళ్లి గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నా విగ్నేష్ శివన్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

జూన్ 9న మంగళవారం మహాబలిపురంలో ఒక్కటవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ఇక పెళ్లి చాలా సింపుల్ గా కేవలం అతి తక్కువ బంధువుల మధ్య జరగనుంది. ఈ పెళ్లి నెట్ ఫ్లిక్స్ ఇండియా లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. తోలుత వీరి పెళ్లి తిరుపతిలో అనుకున్నా మళ్ళీ మహాబలిపురంలో జరగనుంది. అయితే ఇప్పుడొక ఇంస్టాగ్రామ్ పోస్ట్ అందరిని ఆకర్షించింది. నయన, విగ్నేష్ ల పెళ్లి ఆహ్వాన వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. అనిమేషన్ లో తమిళ సాంప్రదాయ పెళ్లి దుస్తుల్లో వధూవరులు వెనుక నుండి కనిపిస్తారు.

ఇక నయనతార తల్లిదండ్రుల పేర్లు, విగ్నేష్ శివన్ తల్లిదండ్రుల పేర్లతో కూడిన ఇన్విటేషన్ లో పెళ్లి తేదీ సమయం వేదిక రాసున్నాయి. ఈ వీడియోను ఎవరు రెడీ చేసారో కానీ చాలా అందంగా ఆకట్టుకుంటోంది అందరినీ. ఇక ఈ వివాహ ఏర్పాట్లు మహాబలిపురంలో జరుగుతున్నాయి. భద్రత ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని సమాచారం. ఇక ఈ వేడుకకు అతిథులు డ్రెస్ కోడ్ లో వస్తారని వినికిడి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago