Nayanatara : సినిమా పరిశ్రమలో ఎవరు ఎవరితో పరిచయం పెంచుకుంటారో, ప్రేమించుకుంటారో చెప్పడం కష్టం. సినిమాల్లో అయితే హీరోలనే హీరోయిన్లు మాత్రమే ప్రేమిస్తారు. కానీ నిజ జీవితంలో హీరోలు హీరోయిన్లనే పెళ్లి చేసుకోవాలని లేదు. ఇక కొంత మంది హీరోలు తమతో నటించిన హీరోయిన్లనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగార్జున అమల, సూర్య జ్యోతిక, నేడు అది పినిశెట్టి, నిక్కీ గల్రానీ అలా ఉన్నా కొంత మంది జంటలు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుని వీడిపోయారు. ఇక కొంత మంది హీరోయిన్లు మాత్రం దర్శకుల ప్రేమలో పడ్డారు.
రోజా, రమ్య, ఇపుడు నయన…..
సుహాసిని మణిరత్నం తెలుగు నాట మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్. రొమాంటిక్ క్లాసిక్ ప్రేమ కథ చిత్రాల దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకుంది. ఇక మన తెలుగింటి అందం రోజా కూడా తమిళ దర్శకుడు సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రోజా ఎక్కువ చిత్రాలు సెల్వమణి దర్శకత్వంలో చేసింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇక ఈ జాబితాలో చేరిన మరో జంట ఖుష్బు సుందర్. రాఘవేంద్రరావు దర్శకత్వంలోని కలియుగ పాండవులు సినిమాలో పరిచయమైన ఖుష్బు తమిళ దర్శకుడు సుందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక రమ్య కృష్ణ కూడా దర్శకుడు కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే రమ్య కృష్ణ తమిళ అమ్మాయి, కృష్ణ వంశీ తెలుగు దర్శకుడు కావడం విశేషం.
నయన, విగ్నేష్ శివన్…..
ఇక ఇపుడు తమిళ లేడీ సూపర్ స్టార్ నయన తార, విగ్నేష్ శివన్ లు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. నయనతార ఇంతకుముందు హీరో శింబుతో ప్రేమాయణం నడిపింది. ఆ తరువాత డాన్స్ మాస్టర్ ప్రభూ దేవా తో కూడా పెళ్లి వరకు వెళ్లినా అప్పటికే పెళ్ళైన ప్రభుదేవా తో ఆ తంతు బెడిసికొట్టింది. రెండు సార్లు ప్రేమ విఫలమైన నయన్ ఇపుడు విగ్నేష్ శివన్ తో పీకల్లోతులో ప్రేమలో ఉంది. జూన్ 9 న మహాబలిపురంలో అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో జరగనుంది. తమిళ యువకుడైన విగ్నేష్, కేరళ కుట్టిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక విగ్నేష్ నయన కన్నా ఏడాది చిన్నవాడు కావడం విశేషం. తోలుత వీరి పెళ్లి తిరుపతిలో జరుగుతుందని భావించినా నయనతార కోరిక మేరకు మహాబలిపురంలో జరుగుతోంది. నయన తార, విగ్నేష్ దర్శకత్వంలో పలు సినిమాలు చేసింది. లేటెస్ట్ గా కన్మని రాంబో ఖతిజ అను సినిమాను విగ్నేష్ డైరెక్షన్ లో నయన తార చేసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…