Dhanush: సొంతింటి కోసం ఏకంగా రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్న ధనుష్!

Actor Dhanush: ఫస్ట్ లవ్ ఎవరో బయటపెట్టిన ధనుష్.. ఆ డైరెక్టర్ బాగా కొట్టేవాడంటూ ధనుష్ షాకింగ్ కామెంట్స్?

Actor Dhanush: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ధనుష్ ప్రస్తుతం తెలుగులో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.అయితే గతంలో ఈయన తమిళంలో చేసిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి తెలుగులో విడుదల అయ్యేవి. అలా ఈయనకు తెలుగులో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే ప్రస్తుతం ధనుష్ పూర్తిస్థాయి తెలుగులో సార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Dhanush Telugu Movie: తెలుగులో ధనుష్ మొదటి సినిమా ఇదే..! మోషన్ పోస్టర్ విడుదల..!
Dhanush Telugu Movie: తెలుగులో ధనుష్ మొదటి సినిమా ఇదే..! మోషన్ పోస్టర్ విడుదల..!

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ధనుష్ ప్రముఖ డైరెక్టర్ కస్తూరి రాజా కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన సోదరుడు సెల్వ రాఘవన్ కూడా పెద్ద దర్శకుడే. ఇకపోతే ధనుష్ హీరోగా తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన తుల్లువదో ఇలమై సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ సినిమా మంచి హిట్ అయినప్పటికీ ధనుష్ గురించి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

Dhanush: సొంతింటి కోసం ఏకంగా రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్న ధనుష్!

ఇకపోతే ధనుష్ తన అన్నయ్య సెల్వ రాఘవన్ ధనుష్ తో కాదల్ కొండెయిన్ అనే సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాతో ఆయనకు నటుడిగా ఎంతో మంచి గుర్తింపు రావడమే కాకుండా మంచి పాపులారీకి సొంతం చేసుకున్నారు .అయితే ఈ సినిమాలో తన అన్నయ్యకు నచ్చిన విధంగా సీన్ రావడం కోసం తనపై ఎన్నోసార్లు చేయి చేసుకున్నారని అయితే ఆరోజు అన్నయ్య కొట్టడం వల్లే ఈరోజు తాను నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నానని ధనుష్ వెల్లడించారు.

ఫస్ట్ లవ్ ఎవరికైనా మెమొరబుల్…

ఇకపోతే తాను ప్లస్ వన్ చదువుతున్న సమయంలోనే తనకు ఫస్ట్ లవ్ ఏర్పడిందని ఇలా ఫస్ట్ లవ్ కారణంగా తను చదువు పూర్తిగా అటకెక్కిందని అప్పటి ప్రేమ జ్ఞాపకాలను ధనుష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఫస్ట్ లవ్ ఎవరికైనా ఎంతో స్వీట్ మెమోరీ అంటూ ధనుష్ ఈ సందర్భంగా తన మొదటి ప్రేమ గురించి బయట పెట్టారు.అప్పుడు తన వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమేనని ధనుష్ వెల్లడించారు. ఇలా ఈయన తన కెరియర్ ఫస్ట్ లవ్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.