Venu Thottempudi: స్వయంవరం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాలలో నటుడిగా అలాగే కొన్ని సినిమాలలో సహాయ నటుడిగా కూడా నటించి మెప్పించారు. ఈ విధంగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈయన ఇండస్ట్రీకి దూరమయ్యారు.
చివరిసారిగా ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకేక్కిన దమ్ము సినిమాలో ఒక చిన్న పాత్రలో వేణు సందడి చేశారు. అయితే ఈ సినిమాలో ఈయన మధ్యలోనే చనిపోవడం జరుగుతుంది. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వేణు మాట్లాడుతూ దమ్ము సినిమా గురించి పలు ఆసక్తికరమైన కామెంట్ చేశారు.
బోయపాటి శ్రీను సినిమా అంటే గుడ్డిగా కథను నమ్మి చేశాను. ఈ సినిమాలో తన పాత్ర షోలే సినిమాలో అమితాబచ్చన్ పాత్ర అని చెప్పారు.ఇక ఈ సినిమా తెరకేక్కిన తర్వాత అందులో నా సీన్లు అన్నీ కట్ చేశారు కేవలం చనిపోయే సినిమా పెట్టారు. షోలే సినిమాలో అమితాబచ్చన్ చనిపోతారు ఇక్కడ నా పాత్ర కూడా చనిపోతుందనీ వేణు తెలిపారు.
ఇలా తన సీన్స్ తీసేసారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వేణు తెలిపారు. అయితే ఈ సినిమాలో నటించినందుకు తాను ఏమాత్రం రిగ్రేట్ గా ఫీల్ అవ్వలేదని, ఇదొక జర్నీ’. ఈ జర్నీలో నన్ను వెతుక్కుంటూ వచ్చిన పాత్రల్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. నాకు నచ్చిన పాత్ర రాలేదని నా జర్నీ అక్కడే ఆపలేను కదా అంటూ ఈ సందర్భంగా దమ్ము సినిమాలో తన పాత్ర గురించి వెల్లడించారు.
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్‌కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…