Venu Thottempudi: షోలేలో అమితాబచ్చన్ లాంటి పాత్ర అన్నారు.. కట్ చేస్తే సీన్లన్నీ లేపేశారు.. దమ్ము సినిమా విషయంలో వేణు షాకింగ్ కామెంట్స్ !

0
451

Venu Thottempudi: స్వయంవరం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాలలో నటుడిగా అలాగే కొన్ని సినిమాలలో సహాయ నటుడిగా కూడా నటించి మెప్పించారు. ఈ విధంగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈయన ఇండస్ట్రీకి దూరమయ్యారు.

చివరిసారిగా ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకేక్కిన దమ్ము సినిమాలో ఒక చిన్న పాత్రలో వేణు సందడి చేశారు. అయితే ఈ సినిమాలో ఈయన మధ్యలోనే చనిపోవడం జరుగుతుంది. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వేణు మాట్లాడుతూ దమ్ము సినిమా గురించి పలు ఆసక్తికరమైన కామెంట్ చేశారు.

బోయపాటి శ్రీను సినిమా అంటే గుడ్డిగా కథను నమ్మి చేశాను. ఈ సినిమాలో తన పాత్ర షోలే సినిమాలో అమితాబచ్చన్ పాత్ర అని చెప్పారు.ఇక ఈ సినిమా తెరకేక్కిన తర్వాత అందులో నా సీన్లు అన్నీ కట్ చేశారు కేవలం చనిపోయే సినిమా పెట్టారు. షోలే సినిమాలో అమితాబచ్చన్ చనిపోతారు ఇక్కడ నా పాత్ర కూడా చనిపోతుందనీ వేణు తెలిపారు.

ప్రతి ఒక్క పాత్రను గౌరవించాలి…

ఇలా తన సీన్స్ తీసేసారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వేణు తెలిపారు. అయితే ఈ సినిమాలో నటించినందుకు తాను ఏమాత్రం రిగ్రేట్ గా ఫీల్ అవ్వలేదని, ఇదొక జర్నీ’. ఈ జర్నీలో నన్ను వెతుక్కుంటూ వచ్చిన పాత్రల్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. నాకు నచ్చిన పాత్ర రాలేదని నా జర్నీ అక్కడే ఆపలేను కదా అంటూ ఈ సందర్భంగా దమ్ము సినిమాలో తన పాత్ర గురించి వెల్లడించారు.