Venu Thottempudi: సాధారణంగా ఒక సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు ఎక్కువ శాతం వారి సినిమాలకు వారి డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం తమ సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోరు. ఇలాంటి కోవకు చెందిన వారే వేణు తొట్టెంపూడి.
ఈయన ఇప్పటివరకు సుమారు పాతిక సినిమాల వరకు నటించారు. అయితే ఏ ఒక్క సినిమాలో కూడా ఆయన సొంతంగా డబ్బింగ్ చెప్పలేదు. వేణు సినిమాలలో నటించినప్పటికీ ఈయనకు మాత్రం గత కొంతకాలం నుంచి వాయుపుత్ర నాగార్జున గారు డబ్బింగ్ చెబుతున్నారు. ఈయన వృత్తి రీత్యా కాలేజ్ ప్రొఫెసర్ అయినప్పటికీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలకు వారి బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా డబ్బింగ్ చెప్పేవారు.
ఈయన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు ఎంతో మంది ఆర్టిస్టులకు ఇలా డబ్బింగ్ చెబుతూ ఉన్నప్పటికీ ఈయన పేరు మాత్రం తెర వెనకే ఉండిపోయింది. ఈ విధంగా డబ్బింగ్ ఆర్టిస్టులకు తెరపై ఏమాత్రం గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇకపోతే నాగార్జున గారు కూడా ఎప్పుడు తనకు పేరు ప్రఖ్యాతలు రావాలని, తాను ఫలానా హీరోలకు డబ్బింగ్ చెబుతున్నారని ఎక్కడ చెప్పుకోలేదు.
ఈ విధంగా తొట్టెంపూడి వేణు గత అన్ని సినిమాలకు వాయుపుత్ర నాగార్జున గారు డబ్బింగ్ చెప్పగా తాజాగా ఈయన నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో మాత్రం మొదటిసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేస్తున్న వేణు ఇలా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల తన పాత్రను తాను ఓన్ చేసుకోగలుగుతున్నాను అంటూ సమాధానం చెప్పారు. ఇలా మొదటిసారి డబ్బింగ్ చెప్పుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వేణు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…