Puneeth Rajkumar: తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎలాగో కన్నడ చిత్ర పరిశ్రమకు రాజ్ కుమార్ అలా.కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడు రాజ్ కుమార్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన కుమారులు ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా రాజ్ కుమార్ చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్ బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఈయన బాల నటుడుగానే కాకుండా హీరోగా ఎన్నో సినిమాలలో నటించి విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. కేవలం సినిమాల పరంగా మాత్రమే కాకుండా పునీత్ తన మంచి మనస్తత్వంతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. అయితే ఆయన బ్రతికున్నప్పుడు ఏ ఒక్కటి బయటకు చెప్పుకోలేదు. ఆయన మరణాంతరం ఈ విషయాలు తెలియడంతో పునీత్ అంటే కూడా తెలియని వారు సైతం ఈయన అభిమానులుగా మారిపోయారు.
గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటుతో మరణించిన పునీత్ మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం సినిమా షూటింగ్ పనులు పూర్తి అయిన తర్వాత తన కుటుంబంతో సంతోషంగా గడుపుతూ వివాదాలకు దూరంగా ఉండే పునీత్ తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి కూడా ఇష్టపడరు. అందుకే ఈయనకు సంబంధించిన చాలా విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు.
ఇకపోతే పునీత్ భార్య అశ్విని గురించి చాలామందికి తెలియదు. పునీత్ భార్య ఓ ధనవంతులు కుటుంబానికి చెందిన అమ్మాయి అనుకుంటే పొరపాటే ఈమె ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఓ కార్యక్రమంలో భాగంగా ఫ్రెండ్ ద్వారా పునీత్ అశ్విని మధ్య పరిచయం ఏర్పడింది. ఇలా ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు కూడా వారి కుటుంబ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.అశ్విని ఆ ఇంటికి చిన్న కోడలుగా అడుగుపెట్టగా తనకన్నా ఇద్దరు కోడలు ధనవంతుల కుటుంబం నుంచి రావడంతో ఈమె ఆ కుటుంబంతో కలవలేకపోయింది.అయితే పునీత్ తన కుటుంబ సభ్యులకు గురించి వివరించగా మెల్లిమెల్లిగా ఈమె కూడా ఆ కుటుంబ సభ్యులతో కలిసిపోయి అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.అయితే ప్రస్తుతం పునీత్ వారి మధ్య లేకపోయిన రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు తనను సొంత మనిషిగానే భావిస్తున్నారని అశ్విని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…