Pokiri Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కు రవితేజకు మధ్య మంచి బాండింగ్ ఉంది అనే విషయం మనకు తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్ రవితేజకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోని పూరి జగన్నాథ్ రవితేజకు పోకిరి సినిమా కథ చెప్పారు.
ఈ సినిమా కథ చెప్పిన పూరి జగన్నాథ్ ఈ సినిమాకు సన్నాఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యారట. ఈ కథ రవితేజకు చెప్పగా అదే సమయంలోనే రవితేజకు రీమేక్ చిత్రం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సినిమా అవకాశం వచ్చింది.అయితే ఈ సినిమా కథ రవితేజకు విపరీతంగా నచ్చడంతో ఈ సినిమా పూర్తి కాగానే పూరీతో సినిమా చేస్తానని చెప్పారట.
ఇక రవితేజ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకునేలోపు పూరి జగన్నాథ్ మరో సినిమా చేద్దామని భావించి 143 అనే సినిమా చేసి విడుదల చేసినప్పటికీ రవితేజ ఫ్రీ కాలేదు. దీంతో పూరి జగన్నాథ్ మరో హీరోతో ఇంకో సినిమా చేయాలని భావించారు. అయితే అది వర్కౌట్ కాకపోవడంతో ఒక హోటల్లో మహేష్ బాబును కలిసిన పూరి పోకిరి సినిమా గురించి వివరించారు. ఈ కథ విన్న మహేష్ బాబు సినిమా నచ్చడంతో వెంటనే చేద్దామని చెప్పి సినిమాలో కొన్ని మార్పులు చేయించారట.
ఇక ఈ సినిమాకు పోకిరి అనే టైటిల్ చెప్పడంతో మహేష్ బాబు ఎంతో ఎక్సైట్ అయ్యారని, ఈ సినిమాని కేవలం 70 రోజులలో షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్రలో అయేషా టకియా, పార్వతి మెల్టన్ వంటి వారిని పరిశీలించినప్పటికీ ఫైనల్ గా ఇలియానా ఎంపికయ్యారు. మొత్తానికి పూరి జగన్నాథ్ ఇలియానా మహేష్ బాబు కాంబినేషన్ లో పోకిరి వంటి బ్లాక్ బస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని రవితేజ మిస్ చేసుకున్నారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…