Samantha: నాగచైతన్య సమంత పెళ్లయిన తర్వాత కొన్ని రోజుల పాటు సంతోషంగా ఉన్నప్పటికీ వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. వీరి విడాకుల గురించి ఎన్నో వార్తలు రాగా, తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ టాక్ షోలో అసలు విషయాలు చెబుతూ తన గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.ఇకపోతే వివాహమైన తర్వాత వీరిద్దరూ ప్రముఖ నటుడు మురళీమోహన్ ఇంటిని కొనుక్కొని అక్కడే ఉండేవారని ఇదివరకు ఇంటర్వ్యూలో మురళీమోహన్ వెల్లడించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళి మోహన్ సమంత గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సమంత నాగచైతన్య వివాహమైన తర్వాత మా ఇంటిని కొనుక్కొని ఇక్కడే ఉన్నారు.ఈ ఇంటిలో ఉంటూ వారిద్దరూ కలిసి ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలని ఒక కొత్త ఇంటిని కొన్నారు. అయితే ఆ సమయంలోనే ఆ ఇంటిని వేరే వాళ్లకు అమ్మారు. ఇకపోతే వాళ్లు కొన్న ఇల్లు రీ మోడలింగ్ చేసేవరకు అదే ఇంట్లో ఉంటామని ఓనర్ వాళ్ళను ఒప్పించి అక్కడే ఉన్నారని మురళీమోహన్ తెలిపారు.
ఇక సమంత నాగచైతన్య కొన్న ఇల్లు రీ మోడలింగ్ పూర్తి కాకుండానే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.ఇకపోతే సమంత తను ఉండడం కోసం సిటీలో ఎన్నో చోట్ల ఇంటి కోసం తిరిగినప్పటికీ తనకు ఎక్కడ ఇలాంటి ఇల్లు దొరకకపోవడంతో తిరిగి తన వద్దకు వచ్చి ఆ ఇల్లు కావాలని అడిగినట్లు మురళీమోహన్ తెలిపారు.
అప్పటికే సమంత నాగచైతన్య ఆ ఇంటిని వేరే వాళ్లకు అమ్మడంతో వాళ్లతో మాట్లాడి మరింత ఎక్కువ డబ్బు చెల్లించి తిరిగి ఆ ఇంటిని సొంతం చేసుకున్నారని మురళీమోహన్ వెల్లడించారు.ఇలా ఈ ఇంటిలో తనకు ఎంతో సేఫ్టీ గా ఉంటుందని, సెక్యూరిటీ పరంగా అదే మంచి ఇల్లు అనీ నిర్ణయించుకున్న సమంత అదనపు డబ్బులు చెల్లించి ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన తల్లితో కలిసి అక్కడే నివసిస్తున్నారని మురళీమోహన్ ఈ సందర్భంగా ఆ ఇంటి గురించి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…