Dhanush: సొంతింటి కోసం ఏకంగా రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్న ధనుష్!
Actor Dhanush: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ధనుష్ ప్రస్తుతం తెలుగులో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.అయితే గతంలో ఈయన తమిళంలో చేసిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి తెలుగులో విడుదల అయ్యేవి. అలా ఈయనకు తెలుగులో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే ప్రస్తుతం ధనుష్ పూర్తిస్థాయి తెలుగులో సార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ధనుష్ ప్రముఖ డైరెక్టర్ కస్తూరి రాజా కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన సోదరుడు సెల్వ రాఘవన్ కూడా పెద్ద దర్శకుడే. ఇకపోతే ధనుష్ హీరోగా తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన తుల్లువదో ఇలమై సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ సినిమా మంచి హిట్ అయినప్పటికీ ధనుష్ గురించి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.
ఇకపోతే ధనుష్ తన అన్నయ్య సెల్వ రాఘవన్ ధనుష్ తో కాదల్ కొండెయిన్ అనే సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాతో ఆయనకు నటుడిగా ఎంతో మంచి గుర్తింపు రావడమే కాకుండా మంచి పాపులారీకి సొంతం చేసుకున్నారు .అయితే ఈ సినిమాలో తన అన్నయ్యకు నచ్చిన విధంగా సీన్ రావడం కోసం తనపై ఎన్నోసార్లు చేయి చేసుకున్నారని అయితే ఆరోజు అన్నయ్య కొట్టడం వల్లే ఈరోజు తాను నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నానని ధనుష్ వెల్లడించారు.
ఫస్ట్ లవ్ ఎవరికైనా మెమొరబుల్…
ఇకపోతే తాను ప్లస్ వన్ చదువుతున్న సమయంలోనే తనకు ఫస్ట్ లవ్ ఏర్పడిందని ఇలా ఫస్ట్ లవ్ కారణంగా తను చదువు పూర్తిగా అటకెక్కిందని అప్పటి ప్రేమ జ్ఞాపకాలను ధనుష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఫస్ట్ లవ్ ఎవరికైనా ఎంతో స్వీట్ మెమోరీ అంటూ ధనుష్ ఈ సందర్భంగా తన మొదటి ప్రేమ గురించి బయట పెట్టారు.అప్పుడు తన వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమేనని ధనుష్ వెల్లడించారు. ఇలా ఈయన తన కెరియర్ ఫస్ట్ లవ్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…