Actor Keshava Deepak : 75 సినిమాలలో నటించినా ఇప్పటికి గుర్తింపు రాకపోడానికి కారణం అదే…: నటుడు కేశవ్ దీపక్

Actor Keshava Deepak : బళ్లారి కి చెందిన కేశవ్ దీపక్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి 2006 లో వచ్చిన స్టైల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. క్లాసికల్ డాన్సర్ అయిన ఆయన డాన్సర్ తో పాటు యాక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారు. నాటక రంగం నుండి వచ్చిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆచితూచి మంచి పాత్రలను ఎంచుకుంటూ ఇపుడిప్పుడే మంచి గుర్తింపు అందుకుంటున్నారు. స్టైల్ సినిమా తరువాత “పెళ్లి గోల” వెబ్ సిరీస్ లో చేసిన ఆయన నిఖిల్ సిద్ధార్థ్ “అంకిత్ నిక్కీ అండ్ ఫ్రెండ్స్” సినిమాలో నటించారు. ఇక విజయ్ దేవరకొండ “పెళ్లి చూపులు” లో నటించిన అయన తాజాగా విజయ్ కొత్త సినిమాలో కూడా చేస్తున్నారు. ఇక నరేష్ “మారేడుమిల్లి నియోజకవర్గం”, బాలకృష్ణ గారితో “కథనాయకుడు” సినిమాలో నటించిన ఆయన “వీర సింహారెడ్డి” సినిమాలో కూడ నటించారు.

గుర్తింపు రాకపోడానికి కారణం….

కేశవ్ దీపక్ గారు దాదాపు 2006 నుండి ఇండస్ట్రీ లో ఉన్నారు. పైగా నాటక రంగం నుండి వచ్చినవారు. అయినా ఇంకా జనాలకు రిజిస్టర్ అయ్యే పాత్ర ఏ సినిమాలోనూ తనకు పడలేదు. ఈ విషయం గురించి కేశవ్ దీపక్ మాట్లాడుతూ ఇప్పటివరకు దాదాపు 75 సినిమాలను చేసిన జనాలు గుర్తు పట్టేలాంటి హిట్ అయిన పాత్రలు ఇంకా రాలేదు.

అయితే చేసిన ప్రతి క్యారెక్టర్ సినిమాలో ఎంతో కొంత ఇంపార్టెంట్ రోల్ చేశాను. మన పని మనం చేసుకుంటూ పోతుంటే ఏదో ఒక రోజు మన కష్టానికి గుర్తింపు లభిస్తుందని నేను నమ్ముతాను అంతవరకు ఓపిగ్గా ఉండాలి. ఒక్కసారి మనకు గుర్తింపు వస్తే ప్రేక్షకులు గూగుల్ లో మన గురించి వెతికినపుడు పలానా సినిమాలో చేసాడు మనం గమనించలేదే అనుకుంటారు. అలా అని ఏవంటే ఆ పాత్రలను చేయాలనీ అనుకోవడం లేదు కెరీర్ లో ఆచితూచి అడుగులేస్తున్నా అంటూ కేశవ తెలిపారు.