Actor Nagineedu : అల్లు రామలింగయ్యతో రావురమేష్ ని పోల్చడమెంటి…? అప్పటికి నరేష్, రాజేంద్ర ప్రసాద్ ల వేవ్ స్టార్ట్ అవ్వలేదు…: నాగినీడు

Actor Nagineedu : మర్యాద రామన్న సినిమాలో విలన్ గా సరికొత్త విలనిజం చూపించిన నాగినీడు గారు ఆయన సినిమా కెరీర్ కు ముందు ఏం చేసేవారో అనే విషయాలు చాలా మందికి తెలియవు. ఇక ఆయన మర్యాద రామన్న సినిమా తరువాత ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు. రాయలసీమ యాసలో ఫ్యాక్షనిస్ట్ గా నటించిన ఆయన ఆ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఆయన సినిమాలకంటే ముందు ప్రసాద్ లాబ్స్ లో జనరల్ మేనేజర్ గా పని చేసేవారు. ఇక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నాగినీడు గారు విలన్ పాత్రలనే కాకుండా కామెడీ రోల్స్ చేయాలని ఉంది అంటూ అలాంటి పాత్రలను డైరెక్టర్స్ ఇవ్వడం లేదంటూ అభిప్రాయపడ్డారు.

అల్లు రామలింగయ్య తో రావు రమేష్ ను పోల్చడం ఏంటి….

జయప్రకాష్ రెడ్డి గారిలాగా అటు సీరియస్ విలన్ పాత్రలు చేస్తూనే కామెడీ పాత్రలు చేయాలని ఉందంటూ మనసులోని మాటను చెప్పిన నాగినీడు గారు, రావు రమేష్ గారి నటన గురించి మాట్లాడుతూ సీమ టపాకాయ సినిమాలో ఇద్దరు కలిసి పనిచేసినపుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మీ కాంబినేషన్ అల్లు రామలింగయ్య, రావు గోపాల రావులాగా సక్సెస్ అవుతుంది అన్నపుడు అల్లు రామలింగాయ్య గారితో రావు రమేష్ గారిని పోల్చడం ఏంటి ఆయన నటన వేరు ఈయన నటన పరిమితి వేరు.

అల్లు రామలింగయ్య గారిని తక్కువ చేయడం అని కాదు కానీ అల్లు రామలింగయ్య గారు కామెడీ పాత్రలను బాగా చేయగలరు కానీ రావు రమేష్ అన్ని పాత్రలను చేయగలరు అందులో ఇంకా మంచి ఏజ్ లో ఉన్నాడు విలక్షణంగా నటించగలడు మర్యాద రామన్న సినిమాలో మొదటి సిన్ లో రావు రమేష్ నటన వల్లే నా నటన హైలైట్ అయింది అంటూ చెప్పారు. ఇక ఉద్యోగం చేస్తూ ప్రసాద్ ల్యాబ్ హైదరాబాద్ లో అన్ని బాధ్యతలను ఆయనే చూసుకున్నారు. అదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నరేష్,రాజేంద్ర ప్రసాద్ లు ఇంకా వారికి నచ్చక పోయిన కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్న రోజులవి అంటూ అది వాళ్ళ ఎంట్రీ లెవెల్. హీరోలుగా అప్పటి దాకా కనిపించిన వాళ్ళు ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలాగే కామెడీ పాత్ర లో హీరో తండ్రి గా నటించారు. ఇప్పుడున్నంత సక్సెస్ అప్పట్లో లేదు , ఇక ఓల్డ్ హీరోలను ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలాగే విలన్ రోల్స్ కి తీసుకుంటున్నారు ట్రెండ్ మార్చారు అంటూ అభిప్రాయపడ్డారు.