R.Narayana Murthy: సింప్లిసిటీకి నిదర్శనం అతడు..! 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు..!

R.Narayana Murthy: సింప్లిసిటీకి నిదర్శనం అతడు..! 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు..!

R.Narayana Murthy: ఆర్. నారాయణ మూర్తి.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తూ.. ప్రజల సమస్యలే సినిమా వస్తువులుగా సినిమాలు తీస్తుంటారు. తన సినిమాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ… ప్రజల్ని చైతన్యవంతులుగా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.

R.Narayana Murthy: సింప్లిసిటీకి నిదర్శనం అతడు..! 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు..!
R.Narayana Murthy: సింప్లిసిటీకి నిదర్శనం అతడు..! 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు..!

తను కోరుకుంటే.. ఎన్నో కమర్షియల్ సినిమాల్లో పనిచేసే అవకాశం ఉన్నా…డబ్బు కోసం ఏనాడు వెంపర్లాడలేని వ్యక్తిగా ఆర్ నారాయణ మూర్తి నిలుస్తారు. ఇండస్ట్రీలో తనను గౌరవించని వారు ఉండరంటే.. అతిశయోక్తి కాదు.  రైతు కుటుంబంలో జన్మించిన నారాయాణ మూర్తి కాలేజ్ లో చదువుకునేపటప్పుడు విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పిని చేశాడు.

R.Narayana Murthy: సింప్లిసిటీకి నిదర్శనం అతడు..! 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు..!

తిండి, వసతి లేక మద్రాస్ లో ఉండేటప్పుడు ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఏ చదివిన నారాయణ మూర్తి స్నేహితుల సాయంతో ‘‘ అర్థ రాత్రి స్వాతంత్య్రం’’ అనే సినిమాను తెరకెక్కించాడు. 
ఇన్ని ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. కూడా తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు.

ఉన్నది పంచి పెడుతూ ఉంటాడని…

ఎక్కడికి వెళ్లినా.. ఆటోలో, నడుచుకుంటూ  వెళ్లడం నారాయణ మూర్తి సింప్లిసిటీకి నిదర్శనం. ఇవ్వాళ ఒక్క సినిమాలోనే నటిస్తే కార్లు, బిల్డింగులు వస్తున్నాయి. కానీ దశాబ్ధాలుగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ సొంత ఇళ్లు, కారు కూడా లేని నిరాడంబర వ్యక్తి నారాయణ మూర్తి. తనకు ఉన్న 12 ఎకరాల భూమిని దానం చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. నారాయణ మూర్తి తల్లి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన కొడుకు ఉన్నది పంచి పెడుతూ ఉంటాడని… హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోమని చెబితే వినలేదని ఆమె అన్నారు. ఇక నారాయణ మూర్తికి చేపల పులుసు, గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం మని వెల్లడించారు.