R.Narayana Murthy: సింప్లిసిటీకి నిదర్శనం అతడు..! 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు..!
R.Narayana Murthy: ఆర్. నారాయణ మూర్తి.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తూ.. ప్రజల సమస్యలే సినిమా వస్తువులుగా సినిమాలు తీస్తుంటారు. తన సినిమాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ… ప్రజల్ని చైతన్యవంతులుగా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.
తను కోరుకుంటే.. ఎన్నో కమర్షియల్ సినిమాల్లో పనిచేసే అవకాశం ఉన్నా…డబ్బు కోసం ఏనాడు వెంపర్లాడలేని వ్యక్తిగా ఆర్ నారాయణ మూర్తి నిలుస్తారు. ఇండస్ట్రీలో తనను గౌరవించని వారు ఉండరంటే.. అతిశయోక్తి కాదు. రైతు కుటుంబంలో జన్మించిన నారాయాణ మూర్తి కాలేజ్ లో చదువుకునేపటప్పుడు విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పిని చేశాడు.
తిండి, వసతి లేక మద్రాస్ లో ఉండేటప్పుడు ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఏ చదివిన నారాయణ మూర్తి స్నేహితుల సాయంతో ‘‘ అర్థ రాత్రి స్వాతంత్య్రం’’ అనే సినిమాను తెరకెక్కించాడు.
ఇన్ని ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. కూడా తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు.
ఎక్కడికి వెళ్లినా.. ఆటోలో, నడుచుకుంటూ వెళ్లడం నారాయణ మూర్తి సింప్లిసిటీకి నిదర్శనం. ఇవ్వాళ ఒక్క సినిమాలోనే నటిస్తే కార్లు, బిల్డింగులు వస్తున్నాయి. కానీ దశాబ్ధాలుగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ సొంత ఇళ్లు, కారు కూడా లేని నిరాడంబర వ్యక్తి నారాయణ మూర్తి. తనకు ఉన్న 12 ఎకరాల భూమిని దానం చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. నారాయణ మూర్తి తల్లి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన కొడుకు ఉన్నది పంచి పెడుతూ ఉంటాడని… హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోమని చెబితే వినలేదని ఆమె అన్నారు. ఇక నారాయణ మూర్తికి చేపల పులుసు, గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం మని వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…