Actor Shivaji : నేను సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం అదే… ఆ పెద్ద ఆర్టిస్ట్ నేను సంపాదించుకుంటుంటే ఓర్వలేక పోతున్నాడు…: నటుడు శివాజీ

Actor Shivaji : వైఫ్, మిస్సమ్మ, టాట బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం వంటి సినిమాలలో హీరోగా నటించి హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ. అయితే ఈ సినిమాలకంటే ముందే శివాజీ దాదాపు తెలుగులోని అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుని సహాయక పాత్రలు చేసి మెప్పించారు. అయితే శివాజీ సినిమాల్లో నటించాలని, హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీ వైపుకి రాలేదు. డిగ్రీ అయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివాజీ కి కే ఎస్ రామారావు గారి వద్ద ఎడిటింగ్ సూట్ నేర్చుకునే అవకాశం వచ్చి అక్కడ నేర్చుకున్నాక జెమినీ టీవిలో ఎడిటర్ గా పనిచేస్తూ అనూహ్యంగా యాంకర్ అయ్యాడు. అలా యాంకర్ గా ఉన్న సమయంలోనే రాఘవేంద్ర రావు పరదేశి సినిమా ఆడిషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుండగా పాల్గొని అందులో లయతో పాటు రెండో ప్లేస్ తెచ్చుకున్నాడు. అలా ఇండస్ట్రీ కంట పడిన శివాజీ ఆపైన మాస్టర్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటూనే హీరోగా వచ్చిన అవకాశాలను చేస్తూ మరోవైపు డబ్బింగ్ కూడా చెప్పిన శివాజీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమానాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఒక పెద్ధ ఆర్టిస్ట్ అలా చేస్తాడని అనుకోలేదు…

ఒక పేరున్న నటుడి తండ్రి చనిపోతే పరామర్శించడానికి వెళితే ఆ నటుడిని హత్తుకోబోతే చేతులు తీసేసాడు. హోదా ఉంటేనే హత్తుకోవాలని అపుడే అర్థమైంది. మళ్ళీ ఆ నటుడు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతూ పైకి కలరింగ్ ఇస్తుంటాడు. చివరికి అందరం చావాల్సిన వాళ్ళమే ఒక చోటికి పోవాల్సిన వాళ్ళమే కానీ ఈ హోదా అంటూ ఎందుకు బ్రతుకుతారో అనిపించింది. ఇక మరో పెద్ధ ఆర్టిస్ట్ తో కలిసి ఒక పెద్ద ప్రొజెక్ట్ లో నటిస్తున్నపుడు రెమ్యూనరేషన్ అడిగాడు.

మన మనిషే కదా అని చెబితే ప్రొడ్యూసర్ వద్దకు వెళ్లి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులందరిలోనూ అతనికే ఎక్కువ ఇస్తున్నట్లున్నారు అంటూ మాట్లాడాడు. మళ్ళీ వాడొక పెద్ద ఆర్టిస్టు వాడికి గుర్తు రావాలనే చెబుతున్నా, దేవుడు మంచి అవకాశాలను ఇచ్చాడు, పేరు సంపాదించుకున్నాడు, మన అనుకున్నవాళ్లనే ఇలా చేసేవాళ్లను ఏమనాలి నేను సంపాదించుకుంటే ఓర్వలేక పోతున్నాడు అంటూ శివాజీ ఫైర్ అయ్యారు. ఇక మళ్ళీ సినిమాల్లో నటిస్తారా అనే ప్రశ్నకు నటిస్తానని మంచి అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. మంచి కథలను వింటున్నా, నా స్నేహితులే డబ్బు పెడతామని చెబుతుంటే వద్దాన్నాను. అయితే సినిమాల్లో మంచి ఆఫర్స్ వస్తే నెగెటివ్ రోల్ అయినా చేస్తాను అంటూ చెప్పారు.