సొంత తమ్ముడు వద్దంటున్నా..నటి శ్రీలక్ష్మి ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటి శ్రీలక్ష్మి గురించి మనకు తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలో నటించిన శ్రీ లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణం ఏంటి అనే విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

నటి శ్రీలక్ష్మి తండ్రి అమర్ నాథ్ అతను కూడా వృత్తిపరంగా నటుడే.హైదరాబాద్లో నివసించే శ్రీలక్ష్మి కుటుంబం తన తండ్రి మరణం తర్వాత కుటుంబ పోషణ కోసం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లారు. అయితే అక్కడ ఓ ఇంటిలో అద్దెకు ఉండే వారు.శ్రీలక్ష్మి అద్దెకు ఉన్న ఇల్లు తన తండ్రి స్నేహితుడు హీరో భానుచందర్ తండ్రి సంగీత దర్శకుడు వేణు మాస్టర్. అయితే వీరిద్దరు ఫ్రెండ్స్ అన్న విషయం వారికి తెలియదు. కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడు పిల్లలను తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే శ్రీ లక్ష్మి సోదరుడు రాజేష్ నెలవంక సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో రెండు జెళ్ళ సీత అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో సుత్తివేలు భార్యగా శ్రీ లక్ష్మి ఓ చిన్న పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే రాజేష్ తన అక్క సినిమాలలో నటించడం ఇష్టం లేదని, తనని సినిమాలలో నటించవద్దని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్లాల్సిందిగా తనతో గొడవపడ్డారు.అప్పుడు శ్రీలక్ష్మి కుటుంబ పోషణ జరగాలంటే ప్రతి ఒక్కరు సంపాదించాలని ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.

ఈ విధంగా పలు సినిమాలలో చేసిన శ్రీలక్ష్మి సోదరుడు రాజేష్ ఓ ప్రమాదంలో మృతి చెందాడు.ఈ క్రమంలోనే రాజేష్ వారసురాలిగా ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ పలు సినిమాలలో నటిస్తున్నారు. ఈ విధంగా శ్రీ లక్ష్మి సినిమాలలోకి రావడానికి గల కారణాన్ని ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.