Actor Vikram: విక్రమ్ అభిమానులను కాలితో తన్నిన పోలీసులు.. చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!

Actor Vikram: చియాన్ విక్రమ్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు.ఈయన తన కెరియర్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ తో ప్రారంభించినప్పటికీ ఈయన మాత్రం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే విక్రమ్ శ్రీనిధి శెట్టి జంటగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన కోబ్రా సినిమా ఈనెల 31వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పలు ప్రాంతాలలో పర్యటిస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ తో కలిసి హీరో హీరోయిన్స్ ఇద్దరు తిరుచ్చి వెళ్లారు.అయితే ఆ ప్రాంతానికి తమ అభిమాన హీరో వస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు చేరుకున్నారు. అయితే అభిమానులు చేస్తున్న హంగామా చూసి పోలీసులు వారిని కంట్రోల్ చేయాలని భావించారు.

Actor Vikram: పోలీసులపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్…

ఈ విధంగా పోలీసులు విక్రమ్ అభిమానులను కంట్రోల్ చేయలేకపోవడంతో ఒక్కసారిగా అభిమానులపై వీరు దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా ఒక పోలీస్ అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఏకంగా కాలితో తన్నడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇలా అభిమానులపై పోలీసు కాలితో తన్నడంతో అభిమానులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదురు పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.