Actor Vikram: చియాన్ విక్రమ్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు.ఈయన తన కెరియర్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ తో ప్రారంభించినప్పటికీ ఈయన మాత్రం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే విక్రమ్ శ్రీనిధి శెట్టి జంటగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన కోబ్రా సినిమా ఈనెల 31వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పలు ప్రాంతాలలో పర్యటిస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ తో కలిసి హీరో హీరోయిన్స్ ఇద్దరు తిరుచ్చి వెళ్లారు.అయితే ఆ ప్రాంతానికి తమ అభిమాన హీరో వస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు చేరుకున్నారు. అయితే అభిమానులు చేస్తున్న హంగామా చూసి పోలీసులు వారిని కంట్రోల్ చేయాలని భావించారు.
ఈ విధంగా పోలీసులు విక్రమ్ అభిమానులను కంట్రోల్ చేయలేకపోవడంతో ఒక్కసారిగా అభిమానులపై వీరు దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా ఒక పోలీస్ అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఏకంగా కాలితో తన్నడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇలా అభిమానులపై పోలీసు కాలితో తన్నడంతో అభిమానులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదురు పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…