Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస అవకాశాలను అందుకుంటున్న ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ కార్యక్రమానికి దూరం కావడానికి గల కారణాలను కూడా అనసూయ తెలియచేశారు. ఇకపోతే ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి అనసూయ అంటే ప్రత్యేకమైన అభిమానం అనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు ఈయన సినిమాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ మెగాస్టార్ అంటూ కామెంట్లు మోత మోగిపోయింది.
చిరంజీవి పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేస్తూ…సోషల్ మీడియాలో మెగాస్టార్ అంటూ అరిచే ఆప్షన్ లేదు కానీ ఒకవేళ అదే ఆప్షన్ కనుక ఉంటే ట్విట్టర్ పేలిపోయేది అంటూ కామెంట్ చేశారు. ఇలా నేటిజన్ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ పై అనసూయ స్పందించి అవును కదా అంటూ రిప్లై ఇచ్చారు.
ఇలా సోషల్ మీడియాలో మెగాస్టార్ అంటూ అరచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసేలా ఉంటే కచ్చితంగా ఈయన అభిమానుల అరుపులకు ట్విట్టర్ పేలిపోయేది అంటూ కామెంట్ చేయడంతో అనసూయ కూడా అది నిజమేనంటూ ఇలా ఒక్క మాటతో అవును కదా అంటూ రిప్లై ఇచ్చారు. మొత్తానికి అనసూయ ఈ ట్వీట్ పై రెస్పాండ్ అవుతూ రిప్లై ఇవ్వడం గమనార్హం. ఇకపోతే ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగినటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ ఆయనపై ఉన్న అభిమానాన్ని పదాల రూపంలో తెలియజేసి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…