Actress Jayavani : ఆ దర్శకుడు కథ చెప్పడు.. క్యారక్టర్ చెప్పడు.. ఫోన్ చేసి అక్కడికే డైరెక్ట్ గా రమ్మంటాడు. : నటి జయవాణి.

Actress Jayavani : జయవాణి (ఉమామహేశ్వరి) తెలుగు టివీ, చలనచిత్ర నటీమణి. 2006లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుండి సినిమాలపై ఉన్న ఆసక్తితో కూచిపూడి నృత్యం నేర్చుకుంది. జయవాణికి సినిమాల పిప్చి ఎక్కువ కావడంతో 10వ తరగతిలోనే గుమ్మడి చంద్రశేఖర్ రావుతో వివాహం జరిగింది.

Actress Jayavani : ఆ దర్శకుడు కథ చెప్పడు.. క్యారక్టర్ చెప్పడు.. ఫోన్ చేసి అక్కడికే డైరెక్ట్ గా రమ్మంటాడు. : నటి జయవాణి.

పెళ్ళయిన తరువాత బి.ఏ.చదివి, భర్త సహకారంతో నటిగా మారింది. మొదటగా “రండి లక్షాధికారి కండి” అనే టి.వీ. సీరియల్ లో నటించిన జయవాణి, అనేక చిత్రాలలో చిన్నచిన్న పాత్రలు పోషించింది. విక్రమార్కుడు సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. దేశం మొత్తం తలతిప్పుకునేలా చేసిన దక్షిణాది దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సై, విక్రమార్కుడు, చత్రపతి, యమదొంగ, మర్యాద రామన్న లాంటి చిత్రాల్లో జయవాణి నటించారు.

అయితే “సై” చిత్రంలో విలన్ ప్రదీప్ రావత్ కి వ్యాంప్ క్యారెక్టర్ లో జయవాణి కనిపించారు. ఈ మద్య ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రాజమౌళి చిత్రాల్లో “మర్యాదరామన్న” చిత్రం అంటే చాలా ఇష్టమని అందులో మిగతా చిత్రాలలో లాగా వ్యాంప్ క్యారెక్టర్ కాదని కొంచెం పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉంటుందని ఆ సినిమాలో తన పాత్ర బాగుంటుందని చెప్పారు. తను ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా ఒక ఫోన్ కాల్ వస్తుందని.. కథా, క్యారెక్టర్ గురించి ఏమి చెప్పకుండా అందుబాటులో ఏ వాహనం ఉంటే ఆ వాహనంలో డైరెక్టుగా లొకేషన్ కు రమ్మని చెప్తారు.

దర్శకుడు రాజమౌళి ముందుగా తాము ఎలా చేయాలో చేసి చూపిస్తారని అలా చేయడం వలన సమయం వృధా కాకుండా తొందరగా షాట్ ఓకే అవుతుందని… ముఖ్యంగా సై సినిమా షూటింగ్ లో తన క్యారెక్టర్ గురించి రమారాజమౌళి మొత్తం వివరించారని. రాజమౌళికి లొకేషన్ చేరుకొని గుడ్ మార్నింగ్ చెప్పడం ఇష్టం ఉండదని అలా చెబితే మీకు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ నేను ఉండాలా అంటారని.. ఆయన సరదాగా మాట్లాడతారని లొకేషన్ లో ఎంతో డెడికేషన్ తో పని చేస్తారని, ఆయనకు సినిమా తప్పా మరోలోకం తెలియదని నిజంగా వారితో పని చేయడం తన సొంత పుట్టింట్లో పని చేసినట్టుగా ఉంటుందని జయవాణి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.