Featured

‘Jayam’ Child Artist: నితిన్ “జయం” సినిమాలో “సదా” చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

“జయం” సినిమా “తేజ” దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అభూతమైన విజయాన్ని అవ్వడమే కాదు ప్రేక్షకుల మనసు కూడా దోచేసుకుంది. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సషనే అని చెప్పాలి. ఈ చిత్రం తేజ తీసిన మూడవ సినిమా ఇది. అంతకు ముందు “చిత్రం”, “నువ్వు నేను” వంటి విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు దర్శకుడు తేజ. ఈ సినిమాలో “నితిన్, సదా, గోపీచంద్” లకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అంతేకాదు ఈ సినిమాతోనే నితిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

ఇంకా పొతే ఒక కాలేజీ కుర్రాడు అమ్మకి తోడుగా ఉంటూ అడవిలో తేనే పట్టి అమ్ముతుంటాడు. ఆ తరవాత కాలేజీ లో అమ్మాయి పరిచయం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరుగుతుంది. కానీ అప్పటికే ఆ అమ్మాయికి వాళ్ళ బావతో చిన్నప్పుడే పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆమె బావ చేతుల్లో ఆ కుర్రాడు తినే దెబ్బలు, చివరికి అమ్మాయి వాళ్ళ బావని కొట్టి ప్రేమలో వి“జయం” పొందుతాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇదే జయం సినిమా కథ. ఈ కథ తోనే తెలుగునాట అద్భుతమైన విజయం సాధించారు తేజ.

ఈ సినిమాలో “సదా” కి చెల్లెలి గా ఒక అమ్మాయి నటించింది గుర్తుందా..? అదే అండి అక్షరాలను రివర్స్ లో రాస్తూ ఉంటుంది. పైగా స్కూల్ లో టీచర్లు రివర్స్ లో నేర్పిస్తున్నారు అని చెపుతుంది. చివర్లో వాళ్ళ అక్క ప్రేమ గెలవాలని రైలు పెట్ట మీద సుద్ద ముక్కతో కూడా రివర్స్ లో రాస్తుంది. చివరికి అది అద్దంలో చూసి అర్ధం చేసుకుంటాడు హీరో. సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటిపోయింది. జయం చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్వేతా యామిని సైతం చదువుల్లో మొదటి నుండి ముందుండేది అందుకే హీరోయిన్ గా అవకాశాలు వద్దనుకుని మొదట క్యాంపస్ ప్లేసెమెంట్స్ ద్వారా విప్రో లో జాబ్ చేసింది ఆ తర్వాత మాస్టర్స్ అమెరికాలోనే పూర్తి చేసి ఆ తర్వాత వరల్డ్ నెంబర్ వన్ సంస్థ అయినా యూనియన్ బెస్ట్ ట్రేడ్ కంపెనీ లో ఉద్యోగం చేసింది. ఆ తరువాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

యామిని శ్వేతను ఇప్పుడు చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. పెళ్లి తరువాత ఒక పాపకు తల్లిగా వివాహ బంధాన్ని ఆస్వాదిస్తోంది. కానీ.. తను పెద్దయ్యాక సినిమాల్లో నటించి ఉంటే బాగుండేదని ఆమెను చూసినవారంతా అంటున్నారు. అయితే చిన్నప్పుడే పలు సీరియల్స్ లో నటించిన యామిని.. పెద్దయ్యాక హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చినా చేయలేదని యామిని తల్లి నటి జయలక్ష్మి చెప్పారు.

ఇక ప్రస్తుతం తాజగా యామిని శ్వేత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది. తన ఫ్యామిలీ ఫోటోలు, తన కూతురి వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. అయితే.. సోషల్ మీడియాలో ఆమెను చూసిన వాళ్ళు మాత్రం ఇప్పటికైనా సినిమాల్లోకి బాగుంటుంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago