Featured

Sisindri Movie : సంవత్సరం వయస్సులోనే నాలుగు అవార్డులు కొల్లగొట్టిన అఖిల్.. కానీ బాలల హక్కుల సంఘం నుంచి అమలకు నోటీసులు.!

Sisindri Movie : అక్కినేని మూడవ తరం వారసుడు అఖిల్ ప్రధాన పాత్రలో 1995 లో సెప్టెంబర్ 14 న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది సిసింద్రీ సినిమా. అయితే అప్పటిలో ఈ సినిమా ఒక ఏడాది బాబుతో తీయడం ఒక సాహసం అనే చెప్పుకోవాలి. మొదట దర్శకుడు శివ నాగేశ్వర రావు ఇంగ్లీష్ సినిమా అయిన బేబీస్ డే ఔట్ సినిమా చూసి ఇలాంటి సినిమా తెలుగులో తీయాలని తన గురువు అయిన ఆర్జీవీ ని అడుగగా, ఆయన కూడా ప్రోత్సహించడం తో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట.

నాగార్జున ఫ్యామిలీ ఫోటో చూసి అఖిల్ తో ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని దర్శకుడు మొదట అమల ను కలువగా తిరస్కరించిందట, తరువాత ఘరానా మొగుడు షూటింగ్ లో వున్న నాగార్జున ను కలవగా ఆయన ఓకే చేసి, ఈ సినిమా మీద వచ్చే లాభంతో బ్లూ క్రాస్ సొసైటీ బిల్డింగ్ కొందామని మాట ఇవ్వగా అమల ఒప్పుకున్నారట. తన కొడుకు మొదటి సినిమా కాబట్టి నాగార్జున నేను కూడా ఈ సినిమాల్లో నటిస్తానని చెప్పడం, అంతే కాకుండా ఈ సినిమాకు రెమ్యూనరేషన్ వద్దనడం విశేషం. ఈ సినిమా కథను సూర్యదేవర రామ్మోహనరావు అందించారు. మార్టూరి రాజా డైలాగ్స్ అందించగా రాజ్ సంగీతం అందించారు. ఇక అమల ను తల్లి పాత్రలో నటించమని అడుగగా తను నో చెప్పడం ఆమని ని తీసుకున్నారు.

బాలల హక్కుల సంఘం నుంచి నోటీసులు……

ఆఖరికి 1995 మే నెలలో నాగేశ్వర రావు చేతులమీదుగా ఈ సినిమాని ప్రారంభించారు. అయితే చాలా సన్నివేశాలలో అఖిల్ చిన్న పిల్లవాడు కావడం తో ఆమని శరత్ బాబు లు కనిపించకుండా నాగార్జున అమలతో చిత్రీకరణ జరిపారట. ఏడది బాబుతో సినిమా తీయించినందుకు అమల కు బాలల హక్కుల సంఘం నుండి నోటీసులు కూడా అందాయట. కాకపోతే తరువాత అవి వీగిపోయాయి. ఏడాది వయసు వున్న పిల్లాడితో ప్రధాన పాత్రలో సినిమా రావడం, థియేటర్ ల దగ్గర ఆ బాబుకి కటౌట్ లు పెట్టడం అదే మొదటిసారి. నిజాంలో ఈ సినిమా మొదటివారం 31 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. 34 కేంద్రాలలో 50 రోజులు, 7 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. మరో విశేషం ఏమిటంటే అఖిల్ కు ఈ సినిమాలోని నటనకు నాలుగు సంస్థలు అవార్డులు ఇవ్వడం జరిగింది. సిసింద్రీ సినిమా అప్పటిలో పిల్లలు అందరికి నచ్చిన సినిమా అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.

Bhargavi

Recent Posts

హీరోయిన్‌ను దాటేసిన సంజూ.. సోషల్ మీడియాలో కొత్త రికార్డు..

క్రీడా ప్రపంచంలో తన ప్రతిభతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంజూ శాంసన్, ఇప్పుడు సోషల్ మీడియాలోనూ మరో కీలక…

3 seconds ago

“మా మధ్య అలాంటిదేం లేదు”.. కంగన స్ట్రైట్ సమాధానం

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్‌తో తన…

31 minutes ago

ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటున్నారు? ట్యాబ్లెట్లు వేసుకునే సరైన పద్ధతి తెలుసా? మందులు తీసుకునే టైమ్ ఎందుకు ముఖ్యం?

మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్‌ను నోట్లో వేసుకుని నీళ్లు…

4 hours ago

వార్ట్స్‌తో ఇబ్బందా? ఇంట్లోనే సింపుల్ పరిష్కారాలు!

చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…

4 hours ago

అనాథగా జీవితం.. ఆకలి రోజులు.. ఇప్పుడు అందాల నటి

చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…

5 hours ago

ఐఎన్‌సీఏ అవార్డుల్లో తెలుగు సినిమాల జోరు.. నాగ చైతన్య, బుల్లిరాజులకు అవార్డులు!

ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…

5 hours ago