Gopichand: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా,హీరోగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు గోపీచంద్ ఎన్నో సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈయన సినీ కెరీర్ లో హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చాయి.ఒకానొక సమయంలో గోపీచంద్ కెరియర్ పూర్తిగా అయిపోయిందనుకున్న తరుణంలో సిటీ మార్ సినిమా ద్వారా మరోసారి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.
ఇకపోతే తాజాగా గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జులై 1వ తేదీ విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గోపీచంద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కమర్షియల్ అంటే డబ్బు విషయంలో చాలామంది ఎంతో కమర్షియల్ గా ఉంటూ ఉంటారు. ఈ క్రమంలోనే యాంకర్ గోపీచంద్ ని ప్రశ్నిస్తే మీకు అర్జెంటుగా 10000 కావాలని ఫోన్ చేసి అడిగితే ఎవరు వేస్తారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గోపీచంద్ సమాధానం చెబుతూ డైరెక్టర్ మారుతి గారు అని చెప్పారు.
ఈ క్రమంలోనే మారుతి గారికి ఫోన్ చేసి తనకు ఒక్క నిమిషంలో పదివేల రూపాయలు కావాలి అర్జెంట్గా వేయమని చెప్పారు. ఈ విధంగా గోపీచంద్ 10,000 కావాలని అడగడంతో మారుతి మాట్లాడుతూ అదేంటి ఏదో 10 లక్షలు కావాలని అడిగావ్ అన్న అంటూ సమాధానం చెప్పారు. పదివేలే కదా వెంటనే నీ నెంబర్ పంపించు వేస్తాను అని సమాధానం చెప్పారు.
ఇక గోపీచంద్ గూగుల్ పే నెంబర్ కి సెండ్ చేయమని చెప్పగా మారుతీ నిమిషంలో పదివేల రూపాయలు తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ పాత్రలో సందడి చేయనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…