Actress Nandini Roy: టెర్రస్ పై నుంచి దూకి చనిపోవాలనుకున్నా… నటి షాకింగ్ కామెంట్స్!

Actress Nandini Roy: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం ఇక్కడ ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి తెలియదు. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చేవారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉండాలని చెబుతారు.ఇక తెలుగు చిత్రపరిషంలో నటిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నందిని రాయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కార్యక్రమంలో కూడా సందడి చేశారు.

ఇలా పలు సినిమాలు కార్యక్రమాల ద్వారా సందడి చేస్తున్న నందిని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన కెరియర్ మొదట్లో తాను నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు.

ఇలా డిప్రెషన్ లో ఉన్న తాను టెర్రస్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలని కూడా భావించానని ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా చనిపోవాలని నిర్ణయించుకున్న అనంతరం తాను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ఆలోచించి అప్పటినుంచి తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం స్నేహితులతో మాట్లాడుతూ ఆ బాధ నుంచి బయటపడ్డాను అని తెలిపారు.

Actress Nandini Roy: సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్న…


ఇక ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడం కోసం సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా తీసుకున్నానని ఈ సందర్భంగా నందిని రాయ్ వెల్లడించారు. ఇలా సూసైడ్ గురించి నందిని రాయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.