Actress Nandini Roy: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం ఇక్కడ ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి తెలియదు. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చేవారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉండాలని చెబుతారు.ఇక తెలుగు చిత్రపరిషంలో నటిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నందిని రాయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కార్యక్రమంలో కూడా సందడి చేశారు.
ఇలా పలు సినిమాలు కార్యక్రమాల ద్వారా సందడి చేస్తున్న నందిని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన కెరియర్ మొదట్లో తాను నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు.
ఇలా డిప్రెషన్ లో ఉన్న తాను టెర్రస్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలని కూడా భావించానని ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా చనిపోవాలని నిర్ణయించుకున్న అనంతరం తాను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ఆలోచించి అప్పటినుంచి తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం స్నేహితులతో మాట్లాడుతూ ఆ బాధ నుంచి బయటపడ్డాను అని తెలిపారు.
ఇక ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడం కోసం సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా తీసుకున్నానని ఈ సందర్భంగా నందిని రాయ్ వెల్లడించారు. ఇలా సూసైడ్ గురించి నందిని రాయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…