Actress Satya Priya : శోభన్ బాబు, జయలలిత కు ఒక కూతురు.. అనే వదంతుల్లో పచ్చి నిజాలు బయటపెట్టిన సత్యప్రియ.!!

జయలలిత రాజకీయాలలోకి రాకముందు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి 1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది అందే వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది. తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు)అని పిలుచుకుంటారు.

Actress Satya Priya : శోభన్ బాబు, జయలలిత కు ఒక కూతురు.. అనే వదంతుల్లో పచ్చి నిజాలు బయటపెట్టిన సత్యప్రియ.!!

ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఎంజీఆర్, జయలలిత తమిళ ఇండస్ట్రీలో “ది బెస్ట్ పేయిర్” గా చెప్పుకోవచ్చు. వీరిద్దరు కలిసి దాదాపు 28 చిత్రాల్లో కలిసి నటించారు. వీరు కలిసి మొదటగా 1964లో “ఆయిరత్తిల్ ఒరువన్” అనే చిత్రంలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఆ తరువాత అనేకమంది తెలుగు తమిళ కన్నడ మలయాళ హీరోలు ఆమెతో నటించడానికి ఉత్సాహం చూపేవారు.

1970 ఆ ప్రాంతంలో ఎంజీఆర్.. జయలలితను కాకుండా చంద్రకళ, మంజుల, లత కథానాయికలుగా ఓ తమిళ చిత్రంలో ఎంజీఆర్ నటించారు. తనను కాదని వేరే కథానాయికలతో ఎంజీఆర్ నటించడం జయలలితకు నచ్చలేదు. ఆ క్రమంలో జయలలిత, ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగింది. 1971లో జయలలిత తల్లి స్వర్గస్తులయ్యారు. ఆ తర్వాత ఒక్కసారిగా జయలలితకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో (1973) శోభన్ బాబుతో నటించే అవకాశం వచ్చింది. అలా శోభన్ బాబు, జయలలిత కలిసి “డాక్టర్ బాబు” చిత్రంలో కలిసి నటించారు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. 1975 వచ్చేసరికి తమిళంలో పూర్తిగా అవకాశాలు తగ్గడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో శోభన్ బాబుతో సాన్నిహిత్యం పెరిగింది.

1979 “స్టార్ అండ్ స్టైల్” అనే ఓ ఇంగ్లీషు పత్రిక వీరి రహస్య అనుబంధం గురించి రాయడం జరిగింది. ఈ ఇంగ్లీష్ ఆర్టికల్ ని తమిళనాట బాగా పేరు పొందిన “కుముదం” పత్రిక తమిళంలోకి అనువదించి జయలలిత, శోభన్ బాబు రహస్య అనుబంధం గురించి రాశారు. దానికి స్పందించిన జయలలిత.. శోభన్ బాబు తనకు మధ్య బంధం ఉందని… ఒకరి బాధలు, భావాలు పంచుకునేంత దగ్గరని అది ఎంతో పవిత్రమైన అనుబంధమని.. శోభన్ బాబును తను కలిసే నాటికి ఆయన వివాహితుడని కావున ఆయన సతీమణికి ద్రోహం చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తరువాత‌ వారి రహస్య అనుబంధం గురించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలో పుంఖానుపుంఖాలుగా వదంతులతో కూడిన వార్తలు దినపత్రికలో వచ్చాయి. శోభన్ బాబు, జయలలిత మధ్య గల ఆ రహస్య అనుబంధం ఏమిటి అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

అయితే ఈ మధ్యకాలంలో అలనాటి నటి సత్యప్రియ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ… శోభన్ బాబు, జయలలిత మధ్య రహస్య అనుబంధం గురించి ఆమెను అడగగా…. జయలలిత పర్సనల్ మేకప్ మెన్ తనకు కూడా మేకప్ మేన్ గా పని చేశారని… శోభన్ బాబు, జయలలిత మధ్య అనుబంధం నిజమేనని… కానీ వారిద్దరికీ కలిసి ఒక కూతురుకు జన్మించిందనేది అవాస్తవమని మేకప్ మెన్ చెప్పారని.. ఒక్కసారి జయలలిత ద్వేశించిన వ్యక్తిని మల్లి దగ్గరికి రానివ్వదని జయలలిత ముఖ్యమంత్రి అయ్యాక ఒకప్పుడు పర్సనల్ మేకప్ మెన్ గా పని చేసిన అనుబంధంతో ఆమెను కలుద్దామని వెళ్లేసరికి తనను గేటు వద్ద నుంచే పంపించిందని మేకప్ మెన్ తనతో అన్నారని సత్యప్రియ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.