Anil Ravipudi: ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెరపై కామెడీ స్టార్స్, జాతి రత్నాలు, జబర్దస్త్ వంటి ఎన్నో కామెడీ షోలు ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇకపోతే తెలుగు ఓటీటీ సమస్థ అహా వేదికగా ఇప్పటికే ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలు అలాగే డాన్స్ షోలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.
ఇకపోతే తాజాగా ఆహాలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కామెడీ షో కూడా ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి న్యాయ నిర్ణేతగా వ్యవహరించగా సుడిగాలి సుదీర్, దీపికా పిల్లి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముక్కు అవినాష్, సద్దాం, హరి వంటి కమెడియన్లు సందడి చేయబోతున్నారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఈ ప్రోమోలో భాగంగా ముక్కు అవినాష్ సద్దాం కామెడీ పంచ్ లతో అందరిని నవ్వించారు. ఇక యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి సుడిగాలి సుదీర్ ను సైతం వదలకుండా తనపై కూడా తమదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ సందడి చేశారు. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏకంగా యాంకర్ దీపిక పిల్లికి ముద్దు పెట్టడం ఈ ప్రోమోలో హైలెట్ గా మారిపోయింది. ఇది చూసిన పలువురు అనిల్ రావిపూడిలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…