Indhu Anandh : తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అటు సినిమాలు ఇటు సీరియల్స్ లో నటిస్తున్న నటి ఇందు ఆనంద్. చక్రవాకం, మొగలిరేకులు, కళ్యాణ వైభోగమే వంటి సీరియల్స్ తో బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇందు ఆనంద్ సినిమాల్లోనూ చేసినా కొన్ని వాటిలోనే గుర్తింపు ఉన్న పాత్రలను ఎంచుకున్నారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి పాత్రలను చేసిన ఇందు ప్రస్తుతం గమనం, బుడుగు వంటి చిత్రాల్లో నటించారు.
పవన్, రేణు గురించి అప్పుడు నాకు తెలియదు…
బద్రి సినిమాలో రేణు దేశాయ్ తల్లి గా నటించిన ఇందు ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సినిమాల్లోనూ అటు టెలివిజన్ లోనూ బిజీగా ఉన్న ఇందు ఆనంద్ గారిని పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాకు పనిచేసారు. పవన్ కళ్యాణ్ రెఫెర్ చేయడంతో ఇందు గారిని ఆ సినిమాలో తీసుకున్నారట. ఇక ఇదే కాక అంతకు ముందు నాగబాబు కి ఉన్న యాడ్ ఏజెన్సీ లో టాటా సెల్లులర్ కి యాడ్ చేసినపుడు పవన్ కళ్యాణ్ కి తల్లిగా నటించాను అంటూ చెప్పారు.
ఇక ఖుషి సినిమా షూటింగ్ సమయంలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ షూటింగ్ సెట్ లో ఉంటే నాకు వారి విషయం తెలియక మీరు ఏమిటి ఇక్కడ అని రేణు దేశాయ్ ని అడిగేసారట. ఇక రేణు దేశాయ్ మేము కలిసి ఉంటున్నాం అని చెప్పిందట. అప్పటికి తాను తెలుగు మ్యాగ్జైన్స్ లాంటివి చూడకపోవడం వల్ల వాళ్లిదరూ రిలేషన్ లో ఉన్న విషయం తెలియక మొహం మీదే అడిగేసానంటూ అప్పటి విషయాలను తెలిపారు. పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అని, సినిమాల్లోనే కాదు రాజకీయంగానూ బాగా రానిస్తారంటూ చెప్పారు ఇందు. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఆయనకు రాజకీయాల్లో కలిసి వస్తుంది, అన్నింటికీ సమయం రావాలి అంతే అంటూ ఆశాభావం వ్యక్తం చేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…