ఆఫ్ఘనిస్థాన్ లో మరో ఉగ్రదాడి ముప్పు.. హెచ్చరికలు జారీ..!

అమెరికా తన సైనిక స్థావరాలను, సైనికులను ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉపసంహరించుకున్న దగ్గర నుంచి ఆ దేశంలో పరిస్థితితులు రోజురోజుకు దిగజారాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల వశం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ల దేశం నుంచి మరో దేశం వెళ్తేందుకు విశ్రప్రయత్నాలు చేస్తున్నారు.

అక్కడ ఉన్న మహిళలపై బలవంతంగా అత్యాచారం చేసేందుకు వెతుకుతున్నారంటేనే అర్థం చేసుకోవాలి అక్కడ రాక్షసత్వం ఎంతగా ఉందో అని. ఆ దేశం నుంచి మరో దేశానికి రావాలంటే అక్కడ ఒక్కటే మార్గం అది కూడా కాబూల్ ఎయిర్ పోర్ట్ మాత్రమే. అక్కడ నుంచి విదేశీయులు అయినా.. అక్కడి పౌరులు అయినా దేశం దాటడానికి అవకాశం ఉంటుంది. అయితే అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.

ఉగ్రవాదదాడులు ఎయిర్ పోర్టే లక్ష్యంగా జరుగుతున్నాయి. అయినా అక్కడకు ప్రజలు తండోపతండాలకు వస్తూనే ఉన్నారు. ఉగ్రదాడులు జరుగుతున్నా సరే కాబూల్ ఎయిర్ పోర్ట్ వదిలి వెళ్ళటం లేదు. ఒకపక్క కాబూల్ ఎయిర్ పోర్టులో ఉగ్రదాడి జరుగుతుందని అక్కడ ఉన్న పౌరులంతా దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ముందే హెచ్చరికలు జారీ చేసినా అక్కడి నుండి ప్రజలు వెళ్లిపోయిన దాఖలాలు లేవు.

ఫలితంగా కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 180 మందికి పైగా ప్రాణాలను పోగొట్టుకోగా, 150 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. అందులో 169 వరకు ఆఫ్గాన్ పౌరులే ఉన్నారని అక్కడ అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో తాలిబన్లు కూడా 28 మంది ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇలా ఉండగా వాస్తవంగా ఎక్కువ మందే చనిపోయి ఉంటారని అంచనా. ఇదిలా ఉండగా.. మరోసారి కూడా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.