చాలామందికి ఉన్నతంగా ఉంటూ.. డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందులో దాని కోసం అహర్నిషలు కష్టపడుతూ ఉంటారు. ఆ లక్ష్యాలను కొంతమంది నెరవేర్చుకుంటారు.. మరి కొంతమంది ప్రయత్నంలో విఫలం అవుతుంటారు. ఇక్కడ మనం చెప్పుకునే వ్యక్తి గురించి కూడా ఇలాంటిదే. అతడు బాలివుడ్ హీరోలను దగ్గర నుంచి చూసి.. ఫొటోలు దిగి స్నేహితులకు గొప్పలు చెప్పుకుంటూ సంతోషించాలనే అల్ప సంతోషి బిహార్ కు చెందిన జమీల్ షా.
ఇలా అతడు 20 సంవత్సరాల క్రితం ముంబైలో అడుగుపెట్టాడు. ఏదోలా బతికెయ్యడం కోసం కాదు.. హీరోలను చూడాలనే లక్ష్యంతో అతడు ముంబైకి వచ్చాడు. ఇలా అతడు తన ప్రయాణంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ముంబై వెళ్లాలనే లక్ష్యంతో ఒకరోజు రైలు ఎక్కాడు. అక్కడ బతకడానికి చిన్నపాటి ఉద్యోగాలు చేశాడు. ఇలా అతడు ముంబై చేరుకొని స్టార్స్ తో ఫొటోలు కూడా దిగాడు. ముంబైకి చేరుకొని బాలీవుడ్ స్టార్స్‌ను కలవడంతో పాటు వారితో డ్యాన్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీంతో డ్యాన్స్ కూడా నేర్చుకున్నాడు. తర్వాత అతడికి మరో ఆలోచన వచ్చింది.
డ్యాన్స్ వేసే సమయంలో వాడే ష్యూస్ పై అతడి కన్ను పడింది. అంతక ముందే అతడు చెప్పులు తయారు చేసే విద్య నేర్చుకున్నాడు. అతడు డ్యాన్స్ నేర్చుకున్న మాస్టార్ అతడికి ఫోన్ చేసి ఒక మంచి ష్యూస్ కావాలని అడగడంతో చేసి ఇచ్చాడు. అవి చాలామందికి నచ్చడంతో అతడి వద్దకు ఆర్డర్లు వచ్చి పడ్డాయి. దీంతో వివిధ రకాల డిజైన్లతో తయారు చేసి అనధి కాలంలోనే ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్నాడు.
హృతిక్ రోషన్ నుంచి అమీర్ ఖాన్, వరుణ్ ధావన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కోసం జమీల్ బూట్లు తయారు చేశాడు. అతడికి అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు సాధించాడు. ఇప్పడుడు అతడు పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఫొటోలు దిగడంతో పాటు.. అతడు డిజైన్ చేసిన షూస్ ధరించిన ప్రముఖులతో ఫొటోలను దిగుతూ గర్వంగా చెప్పుకుంటున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…