తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా కొనసాగిన హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి గట్టిపోటీగా నిలబడి, ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. అయితే స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈ క్రమంలో సుమన్ అనుకోని కారణాలవల్ల జైలుపాలు కావడంతో అతనికి పెద్దగా సినిమా అవకాశాలు రావడమే కాకుండా నటించిన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇకపోతే స్టార్ హీరో హీరోయిన్ల పిల్లలు ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ సుమన్ కూతురు మాత్రం సినిమా రంగం వైపు అడుగుపెట్టలేదు. అందుకు గల కారణం ఆమెకు చదువు పై ఉన్న ఇష్టం అని చెప్పవచ్చు. సుమన్ కూతురు అఖిలజ ప్రత్యూక్ష. ఈమె చూడటానికి ఎంతో అందంగా ఉండటమే కాకుండా, భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం ఉండడం చేత పలు స్టేజ్ షోలలో నాట్యప్రదర్శన కూడా చేసింది.
ఈమెను సినిమాలలోకి రావాలని ఎంతోమంది ప్రొడ్యూసర్లు నిర్మాతలు అడిగినప్పటికీ ఈమె చదువుపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీకి దూరమయ్యారు.అదే విధంగా తనకు ఇష్టంలేని చోటకు రమ్మని చెప్పడం సుమన్ కి ఇష్టంలేక చదువు వైపు ప్రోత్సహించారు. ఈక్రమంలోనే ఎమ్మెస్సీ హ్యూమన్ జెనెటిక్స్ లో మణిపాల్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకుంది.
ఈ విధంగా చదువుపై ఆమెకు ఉన్న ఆసక్తితో తనకిష్టమైన భరతనాట్యం కూడా పక్కన పెట్టి పై చదువులను కొనసాగించడం కారణంగా సుమన్ కూతురు ఇండస్ట్రీకి దూరమయ్యారని ఓ ఇంటర్వ్యూ సందర్భంలో సుమన్ తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…