Akkineni Amala: ఒకరు తప్పు చేస్తే అందరిని శిక్షిస్తామా… అంబర్ పేట్ ఘటనపై స్పందించిన అమల!

Akkineni Amala: హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల ఘటన ఒక్కసారిగా అందరిని ఎంతగానో కలిచి వేసింది.వీధి కుక్కల దాడి ఘటనలో భాగంగా చిన్నారి ప్రదీప్ మరణించిన విషయం మనకు తెలిసింది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే ఎంతోమంది స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.

ముఖ్యంగా జంతు ప్రేమికులు ఈ ఘటనపై స్పందిస్తూ కుక్కలకే సపోర్ట్ చేస్తూ మాట్లాడటంతో నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. యాంకర్ రష్మీ కుక్కలకు సరైన వసతి కల్పిస్తే ఇలాంటివి జరగవు కదా అంటూ ఆమె కుక్కలకే మద్దతుగా మాట్లాడటంతో నేటిజన్స్ ఆమెను ఏకంగా కుక్కతో పోలుస్తూ ట్రోల్ చేశారు.

ఇకపోతే ఈ ఘటనపై జంతు ప్రేమికురాలు, బ్లూ క్రాస్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వాహకులు, నటి అక్కినేని అమల స్పందించినట్టు తెలుస్తుంది.అయితే ఈమె వీధి కుక్కల గురించి గతంలో చేసినటువంటి కామెంట్లకు సంబంధించిన ఫోటోలను సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో భాగంగా అమల కుక్కలపై తనకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచారు.

Akkineni Amala: మనకు శత్రువులు కాదు….


ఈ క్రమంలోనే ఒక కుక్క తప్పు చేస్తే అన్ని కుక్కలను శిక్షించడం సరైనది కాదు…ఒక మనిషి తప్పు చేశాడని మానవజాతిని శిక్షించలేము కదా అలాగే కుక్కలను కూడా అంతే అవి మనకు శత్రువులు కావు… అవి మనతో ఎంతో నమ్మకంగా ఉండి మనలను రక్షిస్తుంటాయి అంటూ ఈమె చేసినటువంటి కామెంట్లకు సంబంధించిన పోస్టును సుప్రీత షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.