Siri : సీరియల్స్ తో మంచి గుర్తింపు అందుకుని ఆ తరువాత యూట్యూబ్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిరి తన బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో కలిసి చేసిన వెబ్ సిరీస్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ లో పాల్గొన్న సిరి అక్కడ షన్నుతో కలిసి కొంత నెగెటివిటీ మూట గట్టుకున్నా టాప్ 5లో నిలిచింది. ఇక బయటికి వచ్చాక మళ్ళీ టీవీ షోస్ అలానే వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న సిరి, శ్రీహన్ తో ఉన్న రిలేషన్ గురించి వాళ్ళ పెళ్ళెప్పుడు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.
పెళ్ళెప్పుడంటే… అందుకే గ్యాప్…
శ్రీహన్, సిరి కలిసి చేసిన ‘మేడం సార్ మేడం అంతే’ లాంటి వెబ్ సిరీస్ లు బాగా హిట్ అయి వాళ్ళ పెయిర్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ఆ తరువాత కొన్ని సిరీస్ లను చేసిన వాళ్లిద్దరూ కొన్ని రోజులు వేరే సిరీస్ చేయాలని, ఇద్దరూ కలిసి చేస్తూనే ఉన్నాం అని గ్యాప్ తీసుకోవాలని అనుకున్నారట. అయితే ఫ్యాన్స్ అందరూ మీరిద్దరూ చేయండి అంటూ సోషల్ మీడియాలో ఎక్కువ అడుగుతుండటం వల్ల మళ్ళీ వాళ్లిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారట. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ తొమ్మిదేళ్ళుగా ప్రేమలో ఉన్న ఇద్దరూ పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదని చెప్పారు.
రేపు అనుకుంటే రేపే పెళ్లి జరిగిపోతుందని కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది సిరి. ఇక బిగ్ బాస్ లో వచ్చిన నెగెటివిటీ గురించి ప్రేమికుల రోజున ఎమోషనల్ అయిన సిరి నేను ఏది దాచుకోలేను అందుకే నాలో ఉన్న ఆ బాధ కూడా కన్నీళ్ల రూపంలో వచ్చేసింది. శ్రీహన్ నన్ను అర్థం చేసుకుంటాడు. నన్ను క్షమించి గుండెల్లో పెట్టుకుంటాడు అంటూ ఎన్ని సార్లు ఐ లవ్ యు చెప్పాడో ఇంతవరకు లెక్కలేదంటూ తమ క్యూట్ లవ్ స్టోరీ గురించి చెప్పింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…