Ram Charan: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRRసినిమా లోని నాటు నాటు పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా ఆస్కార్ నామినేషన్ లో నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇక మార్చి 12న
లాస్ ఏంజిల్స్ లో జరగనున్న 95వ అకాడమీ అవార్డ్స్ ప్రధానోత్సవంలో చిత్ర బృందం సందడి చేయనున్నారు.
ఇప్పటికే త్రిబుల్ ఆర్ చిత్ర బృందం మొత్తం అమెరికా చేరుకునే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షో తో పాటు ఇతర కార్యక్రమాలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.
తాజాగా రామ్ చరణ్ కేటీఎల్ఏ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆస్కార్ నామినేషన్లో నాటు నాటు పాట ఉండడం గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు. నిజానికి ఓ నటుడిగా ఇది నాకెంతో సంతోషాన్ని కలిగించే క్షణం.ఆస్కార్ వేడుకల్లో నేను ఒక అతిథిగా పాల్గొంటే చాలు అనుకునేవాన్ని అలాంటిది ఈ వేడుకలలో మా సినిమా కూడా నామినేట్ కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
ఇలా మా సినిమాలోని పాట ఆస్కార్ కి నామినేట్ కావడం ఎంతో ఆనందంగా ఉంది అంతకుమించి మరేం కావాలి ఆస్కార్ అవార్డు తీసుకొని మా దేశానికి వెళ్లడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మా ఇండియన్ సినిమాకు 85 ఏళ్ల చరిత్ర ఉంది ఇన్నేళ్లలో ఇప్పుడు మీరు మమ్మల్ని గుర్తించారు. మా సినిమా ఎంతో బాగుందని అప్రిషియేట్ చేశారు. నేను వివిధ దేశాల్లో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ తన సంతోషాన్ని తెలియజేశారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…