నటి ఆమని భర్త, పిల్లలను ఎప్పుడైనా చూసారా..?

ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకడిపంబ చిత్రం ద్వారా తెలుగుతెరపై అడుగుపెట్టిన నటి ఆమని.ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె ఆ తరువాత బాలచందర్, బాపు,ఎస్ వి కృష్ణారెడ్డి వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈమె నటించిన శుభలగ్నం మిస్టర్ పెళ్ళాం మావి చిగురు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ చిత్రాలుగా నిలిచాయి.

ఆమని నటించిన మిస్టర్ పెళ్ళాం చిత్రానికి గాను నంది అవార్డును కూడా అందుకున్నారు.సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించిన ఈమె అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆమని వ్యక్తిగత విషయానికొస్తే ఈమె అసలు పేరు మంజుల. వీరి కుటుంబం బెంగళూరులో నివాసం ఉంటున్నారు.

ఆమనీ తండ్రి అప్పటికే సినిమా డిస్ట్రిబ్యూటర్ గా పని చేసేవారు. ఆమని ఐదు సంవత్సరాల వయసు నుంచే సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఈ విధంగా తెలుగు తెరపై కనిపించడానికి ముందుగానే తమిళంలో ఒక సినిమా తీసిన ఆమని ఆ సినిమా ద్వారా ఏ విధమైనటువంటి గుర్తింపును సంపాదించుకో లేకపోయింది. ఈ క్రమంలోనే ఈవివి దర్శకత్వంలో జంబలకడిపంబ సినిమా ద్వారా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోలందరి సరసన నటించిన ఈమె ఒక్క మెగాస్టార్ చిరంజీవితో నటించలేకపోయింది.మెగాస్టార్ తో కలిసి నటించకపోవడానికి కూడా కారణం ఏంటనే విషయాన్ని ఓ సందర్భంలో ఆమనీ తెలియజేశారు. చిరంజీవితో అవకాశాలు వచ్చిన సమయంలో ఆమని తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఆతర్వాత పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఎలాంటి సినిమాలను చేయలేదు.

ప్రస్తుతం ఆమనకి ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు. పూర్తిగా కుటుంబ బాధ్యతలను చేపట్టిన ఆమని ప్రస్తుతం తన పిల్లలు పెద్దవారు అవుతున్న తరుణంలో ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా సినిమాలో తల్లి పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం ఈమె మాత్రమే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.