సాధారణంగా ఒంట్లో వేడి చేసినప్పుడు, లేదా మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ కారణంగా మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపిస్తుంది. అయితే తరచూ మూత్రాశయం ఇన్ఫెక్షన్ సమస్యతో ఎక్కువ రోజులు బాధపడుతుంటే మీరు భవిష్యత్తులో ప్రమాదకర మూత్రపిండ వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బిజీ లైఫ్ కారణంగా మన శరీర శుభ్రత పాటించకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, నీళ్లు తక్కువగా తాగడం,సురక్షితం కాని లైంగిక చర్యలు, వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్య పురుషుల కంటే మహిళలనే ఎక్కువగా వేధిస్తోందని అనేక సర్వేలు వెల్లడించాయి.దీనికి కారణం మహిళల్లో మూత్రాశయ మార్గం నుంచి మూత్రం బయటికి వెళ్లే మార్గం చాలా చిన్నగా ఉంటుంది. దాంతో బ్యాక్టీరియా చేరి తరుచూ అనేక ఇన్ఫెక్షన్లకు కారణం అవుతోంది.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్ తరచు వస్తుంది.ఈ వ్యాధి సాధారణమైనదే అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంలో పడినట్లే.
మూత్ర విసర్జన సమయంలో ఏర్పడే మంటను అశ్రద్ధ చేయకుండా మొదట్లోనే సరైన చికిత్స తీసుకోని నివారించు కుంటే మంచిది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం వల్ల కూడా మూత్రాశయ ఇన్ఫెక్షన్ ఏర్పడి మంటగా ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలపై ఒత్తిడి అధికమై మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. దాంతోపాటే ఈ ఇన్ఫెక్షన్ కారణంగా రక్తపోటు,గుండె జబ్బులు వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
మూత్రాశయ ఇన్ఫెక్షన్ కారణంగా కలిగే బాధ నుంచి విముక్తి పొందడానికి కొన్ని చిట్కాలు పాటించి తక్షణ ఉపశమనం పొందవచ్చు. మన వంటింట్లో దొరికే ధనియాలు,పటిక బెల్లం, ఉప్పు తో కషాయం చేసుకుని నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనికోసం తగినన్ని ధనియాలను, పటిక బెల్లాన్ని ఉప్పును తీసుకొని మంచి నీటిలో వేసి బాగా మరిగించిన తర్వాత వచ్చే మిశ్రమాన్ని చల్లార్చు కొని రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగాల్సి ఉంటుంది.అయినా మూత్రాశయ ఇన్ఫెక్షన్ తగ్గకుంటే డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…