Featured

నటి ఆమని భర్త, పిల్లలను ఎప్పుడైనా చూసారా..?

ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకడిపంబ చిత్రం ద్వారా తెలుగుతెరపై అడుగుపెట్టిన నటి ఆమని.ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె ఆ తరువాత బాలచందర్, బాపు,ఎస్ వి కృష్ణారెడ్డి వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈమె నటించిన శుభలగ్నం మిస్టర్ పెళ్ళాం మావి చిగురు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ చిత్రాలుగా నిలిచాయి.

ఆమని నటించిన మిస్టర్ పెళ్ళాం చిత్రానికి గాను నంది అవార్డును కూడా అందుకున్నారు.సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించిన ఈమె అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆమని వ్యక్తిగత విషయానికొస్తే ఈమె అసలు పేరు మంజుల. వీరి కుటుంబం బెంగళూరులో నివాసం ఉంటున్నారు.

ఆమనీ తండ్రి అప్పటికే సినిమా డిస్ట్రిబ్యూటర్ గా పని చేసేవారు. ఆమని ఐదు సంవత్సరాల వయసు నుంచే సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఈ విధంగా తెలుగు తెరపై కనిపించడానికి ముందుగానే తమిళంలో ఒక సినిమా తీసిన ఆమని ఆ సినిమా ద్వారా ఏ విధమైనటువంటి గుర్తింపును సంపాదించుకో లేకపోయింది. ఈ క్రమంలోనే ఈవివి దర్శకత్వంలో జంబలకడిపంబ సినిమా ద్వారా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోలందరి సరసన నటించిన ఈమె ఒక్క మెగాస్టార్ చిరంజీవితో నటించలేకపోయింది.మెగాస్టార్ తో కలిసి నటించకపోవడానికి కూడా కారణం ఏంటనే విషయాన్ని ఓ సందర్భంలో ఆమనీ తెలియజేశారు. చిరంజీవితో అవకాశాలు వచ్చిన సమయంలో ఆమని తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఆతర్వాత పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఎలాంటి సినిమాలను చేయలేదు.

ప్రస్తుతం ఆమనకి ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు. పూర్తిగా కుటుంబ బాధ్యతలను చేపట్టిన ఆమని ప్రస్తుతం తన పిల్లలు పెద్దవారు అవుతున్న తరుణంలో ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా సినిమాలో తల్లి పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం ఈమె మాత్రమే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఛార్జింగ్‌లోనే వాడుతున్నారా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

ఈ డిజిటల్ యుగంలో ల్యాప్‌టాప్‌లు మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయాయి. ఉద్యోగాలు, ఆన్‌లైన్ క్లాసులు, వ్యాపార కార్యకలాపాలు, వినోదం,…

7 minutes ago

సేఫ్టీ రోప్ లేకుండానే బంగీ జంప్.. క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన యువతి..

అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే యువతలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. సాధారణ జీవితానికి భిన్నంగా ఉత్కంఠభరిత అనుభూతిని ఆస్వాదించాలనే కోరికతో వేలాది…

16 minutes ago

అమావాస్య ప్రభావమా?.. స్కూల్ రీఓపెన్ రోజున క్లాస్‌లో ఒక్క విద్యార్థినే!

వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…

2 hours ago

ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షాలు..మరో 4 రోజులు కుండపోతకు రెడ్ అలర్ట్!

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…

2 hours ago

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దొంగల కలకలం..వెంటాడిన రైల్వే పోలీసులు..

అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…

2 hours ago

విద్యార్థులకు బూట్లకు బదులు చెప్పులా? కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…

3 hours ago