NTR: ఎన్టీఆర్ లో మీకు తెలియని అద్భుతమైన స్కిల్..! అది ఎవరి వల్ల సాధ్యం అయిందో తెలుసా..?

NTR: ఎన్టీఆర్ లో మీకు తెలియని అద్భుతమైన స్కిల్..! అది ఎవరి వల్ల సాధ్యం అయిందో తెలుసా..?

NTR: ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియాభట్, అజయ్ దేవ్ గన్ వంటి భారీ స్టార్స్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్య విడుదలై సినిమా క్రేజ్ ను మరింతగా పెంచింది. 

 NTR: ఎన్టీఆర్ లో మీకు తెలియని అద్భుతమైన స్కిల్..! అది ఎవరి వల్ల సాధ్యం అయిందో తెలుసా..?
NTR: ఎన్టీఆర్ లో మీకు తెలియని అద్భుతమైన స్కిల్..! అది ఎవరి వల్ల సాధ్యం అయిందో తెలుసా..?

తాజాగా జనవరి 7నే ఆర్ఆర్ఆర్ తెలుగు, హిందీ, మళయాళం, కన్నడ, తమిళంతో పాటు మొత్తంగా 14 భాషల్లో విడుదల కానుంది. అయితే ఓమిక్రాన్ నేపథ్యంలో వాయిదా పడుతుందన్న వాదనలకు ఫుల్ స్టాప్ పెట్టాడు డైరెక్టర్ రాజమౌళి. ముందుగా అనుకున్న తేదీనే ట్రిపుల్ ఆర్ రానున్నట్లు వెల్లడించారు. 

NTR: ఎన్టీఆర్ లో మీకు తెలియని అద్భుతమైన స్కిల్..! అది ఎవరి వల్ల సాధ్యం అయిందో తెలుసా..?

తాజాగా ప్రమోషన్లలో ఆర్ఆర్ఆర్ టీం బిజీగా ఉంది. తాజాగా ’ది కపిల్ శర్శ‘ షోకు ముఖ్య అతిథులుగా ఆర్ఆర్ఆర్ టీం హాజరైంది. రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో హీరోయిన్ అలియా భట్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మళయాళంలో తప్పితే.. హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఓన్ గా డబ్బింగ్ చెప్పుకున్నారని చెప్పింది.

హిందీలో డబ్బింగ్ చెప్పానంటే అమ్మే కారణం – ఎన్టీఆర్..

అయితే హిందీలో ఓన్ గా డబ్బింగ్ చెప్పుకోవడానికి తన తల్లే కారణమని ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెద్దగా కష్టపడకుండా హిందీలో ఎలా డబ్బింగ్ చెప్పాననే విషయాన్ని ఎన్టీఆర్ వెల్లడించారు. హిందీ ఎక్కువగా మాట్లాడే సిటీల్లో హైదరాబాద్ ఒకటి. దీంతోపాటు స్కూల్ లో నా మొదటి భాష హిందీనే అని చెప్పారు. హిందీ నేర్చుకోవాలని మా అమ్మ కోరుకుంది. ఇది మన జాతీయ భాష. దీంతోనే ఇప్పుడు ఈజీగా హిందీలో డబ్బింగ్ చెప్పగలిగానని చెప్పారు. ఇక సినిమా కోసం ముంబై నుంచి టెక్నీషియన్స్ వస్తుంటారు. దాదాపుగా వారితో హిందీలోనే మాట్లాడే వాన్ని. దీంతో హిందీ అలవాటైందని కపిల్ షోలో చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.