NTR - Ramcharan: నాలో సగ భాగం రామ్ చరణ్..! ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..!
NTR – Ramcharan: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ దాదాపు దగ్గర పడటంతో.. దర్శకుడు SS రాజమౌళి .. సినిమా బృందం దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లకు హాజరవుతున్నారు. రాజమౌళితో పాటు సినిమాలోని ప్రధాన నటులు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ కూడా వివిధ నగరాల్లోని మీడియా వ్యక్తులతో మాట్లాడుతూ.. కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్ లలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా.. ఇటీవల కేరళలోని తిరువనంతపురం ప్రోగ్రామ్ lలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి అభిమానులు నగరం అంతటా పోస్టర్లను అంటించేశారు. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకలో హీరోలు తమదైన శైలిలో మాట్లాడారు. వారి స్పీచ్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది.
మొదట రామ్ చరణ్ మాట్లాడతూ.. నాలో సగ భాగం.. నా సెకండ్ హాఫ్.. నా బ్రదర్ లేకపోతే ఈ సినిమా ఇంత వరకు వచ్చేది కాదు అంటూ ఎన్టీఆర్ గురించి రామ్ చరణ్ భావోద్వేగపూరితంగా మాట్లాడాడు. రామ్ చరణ్ గురించి కూడా ఎన్టీఆర్ మరింత గొప్పగా చెప్పేశాడు. మా బంధం ఎప్పటి నుంచో ఉందని.. కానీ మా స్నేహాన్ని మీరు చూడటం ఆర్ఆర్ఆర్ తో సాధ్యం కానుందన్నారు.
రామ్ చరణ్ నాలో సగ భాగం అని.. అందులోనూ ఎడమ భాగం అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు. ఎడమ భాగమే ఎందుకంటే.. గుండె అటువైపే ఉంటుంది కాదా అంటూ భావోద్వేగపూరితంగా మాట్లాడాడు. ఇక తన సోదురుడితో దాదాపు 200 రోజులు గడిపే సమయం ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ చెబుతున్న సమయంలో.. వెనుక నుంచి వచ్చిన రామ్ చరణ్.. ఎన్టీఆర్ ను హత్తుకుంటాడు. ఇదంతా చూస్తున్న అక్కడి అభిమానులు కేరింతలతో సందడి చేశారు. ఇక ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…