Categories: FeaturedMovie News

Radhe shyam-Prabhas: వారికి ఆర్థిక సహాయం చేసిన ప్రభాస్..!వైరల్ అవుతున్న న్యూస్..!

Radhe shyam-Prabhas: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘రాధేశ్యామ్’. దీనికి సంబంధించి ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్‌సిటీ సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఊహించిన దానికంటే భారీగా ప్రభాస్ అభిమానులు తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయడంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ వల్ల కాలేదు.

Radhe shyam-Prabhas: వారికి ఆర్థిక సహాయం చేసిన ప్రభాస్..!వైరల్ అవుతున్న న్యూస్..!

దీంతో కొంతమంది ప్రభాస్ అభిమానులు అక్కడ ఏర్పాటు చేసిన కృష్ణంరాజు కటౌట్‌పైకి ఎక్కి.. ప్రభాస్ ను చూసే ప్రయత్నంలో అది విరిగిపోయింది. ఈ క్రమంలోనే ముగ్గురు అభిమానులకు తీవ్రంగా గాయాలయ్యాయి. 28 మంది పాక్షికంగా గాయాలతో బయటపడ్డారు. అంతేకాకుండా.. గాయపడిన ముగ్గురు అభిమానుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Radhe shyam-Prabhas: వారికి ఆర్థిక సహాయం చేసిన ప్రభాస్..!వైరల్ అవుతున్న న్యూస్..!

ఇక ఈ విషయం ప్రభాస్ కు తెలవడంతో.. వారి వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం చేశారు. తీవ్రంగా గాయపడిని వారికి వైద్య ఖర్చులతో పాటు.. వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సహాయం చేసినట్లు సమచారం. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.


ప్రభాస్ కోసం రంగంలోకి తమన్..

పూజాహెగ్డే కథానాయిక. ఇందులో ప్రభాస్‌ లవర్‌బాయ్‌ పాత్రలో కనిపించనున్నారు. హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో విక్రమాదిత్యగా మెప్పించనున్నారు. పూజా ప్రేరణ పాత్రలో ఆకట్టుకోనున్నారు. విక్రమాదిత్య.. ప్రేరణను సొంతం చేసుకోగలిగాడా.. లేదా.. వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తికర కథాంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకొంది. వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమాకు నేపథ్య సంగీతాన్ని సమకూర్చడానికి తమన్ రంగంలోకి దిగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమా పాటల కోసం జస్టిన్‌ ప్రభాకరన్‌ బాణీలు అందించగా, హిందీ పాటలకి మిథున్‌, అమాల్‌ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌ స్వరాలు సమకూర్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago