Samantha Ruth Prabhu: జిమ్ లో కష్టపడుతున్న సమంత..! వీడియోలు, ఫొటోలు వైరల్..!
Samantha Ruth Prabhu: నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత మళ్లీ వరస సినిమాలో బిజీ అవుతోంది. ఎంతో అన్యోన్యంగా ఉండే నాగ చైతన్య- సమంతల విడాకుల వ్యవహారం టాలీవుడ్ లో సంచలనం అయింది. దీనిపై అప్పట్లో అనేక ఊహాగానాలు కూడా వినిపించాయి.
కొన్నివెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు సమంతపై విపరీతంగా ట్రోలింగ్ చేశాయి. ఈ వ్యవహారంపై సమంత కోర్టులో పరువునష్టం దావా కూడా వేసింది. విడాకుల అనంతరం సమంత ఎమోషనల్ పోస్ట్ లను సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసింది. దీంతో సమంతకు మద్దతుగా పలువురు సెలబ్రెటీలు నిలిచారు.
ఇదిలా ఉంటే విడాకుల వ్యవహారం తరువాత వరసగా.. సినిమాలు చేస్తుంది. తాజాగా పుష్ప సినిమాలో సమంత చేసిన ’’ఊ అంటావా మావా..ఊఊ అంటావా‘‘ పాట రికార్డులను క్రియేట్ చేసింది. తొలిసారిగా ఐటెం సాంగ్ చేసిన సమంతకు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది.
పుష్ప సినిమా రిలీజ్ కు ముందే ఈ పాట యూట్యూబ్ లో సెన్సెషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. తాజాగా సమంత తన ఫ్రెండ్ శిల్పారెడ్డితో సరదాగా ఇటీవల గోవా ట్రిప్ కూడా వేసింది. అక్కడ దిగిన సమంత ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా జిమ్ లో వర్కవుట్ చేస్తున్న సమంత వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా వైరల్ గా మారాయి. సమంత ఫర్ఫెక్ట్ ఫిగర్ కోసం జిమ్ చేయడం అలవాటు. గతంలో కూడా సమంత ఇలా జిమ్ చేసె ఫోటోలు బయటకు వచ్చాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…