కరోనా కంటే భయంకరమైన వ్యాధి.. ఎంతమంది మరణించారంటే..?

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రజలందరినీ గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా విజృంభణకు ముందే ఎన్నో భయంకరమైన వ్యాధులు ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. అయితే కరోనా వేగంగా వ్యాప్తి చెందడం వల్ల ప్రజల్లో ఈ వైరస్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. దాదాపు 47 సంవత్సరాల క్రితం సెయింట్ ఎలిజబెత్ హాస్పిటల్ లో ఒక కొత్త వ్యాధికి సంబంధించిన కేసులకు సంబంధించిన విషయాలను గుర్తించారు.

1965 సంవత్సరంలో లెజియోన్నైర్స్ అనే వ్యాధి శరవేగంగా ప్రబలింది. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి అయిన లెజియోన్నైర్స్ బారిన పడితే శ్వాస అందకపోవడం ప్రజలు గంటల వ్యవధిలోనే చనిపోతారు. ఈ వ్యాధి బారిన పడ్డవారిలో శ్వాస సంబంధిత సమస్యలతో పాటు అనారోగ్యం, విపరీతమైన దగ్గు, నీరసం, జ్వరం, ఇతర లక్షణాలు కనిపించాయి.

అయితే వ్యాధికి సంబంధించిన కీలక విషయాలు దాదాపు పది సంవత్సరాల తర్వాత వెల్లడయ్యాయి. సెయింట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో 81 మంది ఈ వ్యాధి బారిన పడి చికిత్స తీసుకోగా బాధిత రోగుల్లో ఏకంగా 14 శాతం మంది మృతి చెందారు. ఒక ప్రమాదకరమైన బ్యాక్టిరియా అప్పట్లో లెజియోన్నైర్స్ వ్యాధి బారిన పడటానికి కారణమైంది. కొందరు ఎవరో కావాలని బ్యాక్టీరియాను విడుదల చేసి ప్రజలను ప్రమాదంలోకి నెట్టారనే ఆరోపణలు సైతం ఆ కాలంలో వ్యక్తమయ్యాయి.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వ్యాధి గురించి పరిశోధనలు చేయగా బ్యాక్టీరియా ఎయిర్ కండీషన్ రూమ్ లో వ్యాప్తి చెందిందని ఆ సమావేశానికి హాజరైన వారంతా వైరస్ బారిన పడ్డారని సమాచారం. ఆ బ్యాక్టీరియా విజృంభించే ఉంటే మాత్రం కరోనా కంటే ఎక్కువ సంఖ్యలో మరణాలు నమోదై ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.