Analyst Damu Balaji : ఉండవల్లి శ్రీదేవి విడాకుల ఇష్యూ… ఇన్నోవా ఇచ్చిన తాడికొండ సందీప్…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నది ఉండవల్లి శ్రీదేవి సస్పెన్షన్ గురించి. ఎమ్మెల్యే లు ఎన్నుకునే ఎమ్మెల్సి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు ఆమె పాల్పడినట్లు వైసీపీ అధినేతకు అనుమానం రావడంతో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసారు. ఇక ఆమె గురించి వైసీపీ చోటా మోట నాయకుల నుండి పార్టీ నేతలు ఉండవల్లి శ్రీదేవిని బాగా విమర్శిస్తున్నారు. ఆమె అవినీతి గురించి తాజాగా వైసీపీ నేతలు తీవ్రంగా దాడి చేస్తూ విమర్శిస్తుండగా తాజాగా ఆమె భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ఓ కథనం ప్రచారం లోకి వచ్చింది. అలాగే ఆమె అవినీతి గురించి కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇక వాటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

శ్రీదేవి కోసం ఇన్నోవా ఇచ్చిన తాడికొండ సందీప్…

ఉండవల్లి శ్రీదేవి గాజుల వ్యాపారిని కూడా దోచుకుంది అన్నట్లుగా విమర్శలను గుప్పిస్తున్న తరుణంలో తాడికొండ సందీప్ అనే కార్యకర్త ఆమె అవినీతి చిట్టా గురించి చెప్పాడు. ఆమెతో ఏదైనా పని చేయించుకోవాలంటే పదివేల రూపాయలకు మించిన పట్టు చీర ఖచ్చితంగా ఆమెకు ఇవ్వాల్సిందే అలాగే ఆమె ఏదైనా షాపింగ్ కి వెళ్లిన అక్కడ బిల్ కట్టదట. ఆఫీస్ లో ఉన్న ఏసీ లు, ఫర్నిచర్ తో సహా మొత్తం ఆమెతో పనిబడిన వాళ్ళు ఇచ్చినవే అంటూ ఆమె ఒక సాధారణ లేడీసె కార్నర్ షాప్ వాడిని కూడా వదలకుండా దోచుకుంది అంటూ చెప్పారు. ఇక ఆమె భర్త డాక్టర్ శ్రీధర్ కు ఆమెకు విబేధాలు ఉన్నాయని ఇప్ప్పటికే ఒక రెండు సార్లు పంచాయితీ కూడా అయిందని తొందర్లో వాళ్ళు విడిపోతారంటూ వినిపిస్తోందని తెలిపారు .

అయితే దాము బాలాజీ ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఒక దళిత ఎమ్మెల్య్ తొలి సారి ఎమ్మెల్యే అయ్యాక అవగాహన రాహిత్యం తోనే ఆమె కక్కుర్తి పడినట్లు తెలుస్తోందని అదే ఒక అగ్ర కులానికి చెందిన ఎమ్మెల్యే అయితే లక్షలు కోట్లలలో దోచుకుంటున్నారు బయటికి తెలియనివ్వకుండా చేస్తున్నారు అనంతపురం జిల్లాకి చెందిన ఒక రెడ్డి సామాజిక వర్గపు ఎమ్మెల్యే రోజుకు కూరగాయల ట్రేడింగ్ లో 50 లక్షలు దోచుకుంటున్నట్లు వినిపిస్తోంది. అలాంటి అవినీతి ముందు శ్రీదేవి చేసింది చాలా చిన్నది. కేవలం చీరలు వంటి చిన్న చిన్నవి చేసింది. అయిన వైసీపీ లో ఉన్నన్ని రోజులు ఈమె చేస్తున్న అవినీతి గురించి ఒక్కరు మాట్లాడలేదు ఇప్పుడు సస్పెండ్ అయ్యాక అన్ని బయటకు రావడం ఏమిటి ఆమె దళిత ఎమ్మెల్యే కాబట్టి ఆమెను టార్గెట్ చేసారు. అదే ఒక అగ్ర కులానికి చెందిన ఒక ఎమ్మెల్యే గురించి ఇలాంటి అవినీతి విమర్శలను యధేచ్చగా చేస్తారా అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.