Analyst Damu Balaji : జగన్ పై అమిత్ షా దాడి… చంద్రబాబు వ్యూహం వెనుక అసలు కథ ఇదే…: అనాలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఏ పార్టీలో చేరుతారో తెలియదు, ఏ పార్టీ మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో తెలియదు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. రాబోయే ఎన్నికలలో విజయం కోసమే అన్నట్లుగా అన్ని పార్టీలు ఎవరికి వారు వ్యూహ రచనకు పదును పెడుతూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇంతవరకు తెలంగాణలో బీజేపీ కి తెరాస కి అస్సలు పడలేదు. అధికార పార్టీ బిఆర్ఎస్ మీద బాగా ఫైర్ అయింది బీజేపీ అలాగే బీజేపీ మీద విరుచుకుపడ్డాడు గులాబీ బాస్. కానీ తాజాగా కేసీఆర్ గారు ఒక సభలో మాట్లాడుతూ బీజేపీ గురించి ఒక్క విమర్శ చేయకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే ఏపీ రాజకీయాల్లో కూడా కమలం పార్టీ తాజాగా పచ్చపార్టీ వైపు చూస్తోందని అనిపిస్తోంది. ఈ ఇష్యూ గురించి ఆసక్తికర విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషించారు.

జగన్ పై అమిత్ షా విసుర్లు అందుకేనా…

ఏపీ రాజకీయాల్లో వైసీపీ పార్టీ కి మొదటి నుండి బిజెపి స్నేహపూర్వకంగానే ఉంది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు అమిత్ షా, జేపీ నడ్డ తో కలిసి ఢిల్లీ లో చర్చించిన అనంతరం ఏపీ రాజకీయాల్లో మార్పు కనిపిస్తోంది. నిజానికి టీడీపీ శ్రేణులకు బీజేపీ తో టీడీపీ కలవడం ఇష్టం లేకపోయినా ఈ ఎన్నికలు టీడీపీ కి కీలకం కావడం వల్ల చంద్రబాబు బీజేపీ తో దోస్తి కోరుకుంటున్నారు. ఒకవైపు జనసేన బీజేపీ టీడీపీ మూడు కలిసి ఈ ఎన్నికల కోసం రెడీ అవ్వొచ్చు.

అయితే టీడీపీ కి బీజేపీ అవసరం ఉంది కానీ బీజేపీ కి టీడీపీ అవసరం ఏపీ లో లేదు. జగన్ స్నేహం ఉండటం వల్ల టీడీపీ వైపు చూడాల్సిన పని లేదు అంటూ బాలాజీ తెలిపారు. అయితే తెలంగాణ లో బీజేపీ కి టీడీపీ అవసరం ఉంది. టీడీపీ క్యాడర్ అక్కడ ఇంకా బలంగా ఉండటం వల్ల ఆ ఓటు బ్యాంకు బీజేపీ కి వస్తే అధికారం లోకి వచ్చే అవకాశలు ఉన్నాయి. అందుకే ఏపీ టీడీపీ తో పొత్తుకు బీజేపీ ఒప్పుకోవచ్చు. అందుకే తాజాగా ఏపీలో బీజేపీ స్వరం మారిపోయింది. జగన్ ప్రభుత్వం మీద విమర్శలను గుప్పిస్తోంది. తాజాగా వైజాగ్ కి వచ్చిన అమిత్ షా కూడా జగన్ మీద విమర్శలను గుప్పించారు. ఇక జగన్ కూడా వాళ్లంతా కలిసినా నాది ఒంటరి పోరు అంటూ మాట్లాడుతున్నారు అని బాలాజీ అభిప్రాయపడ్డారు.