Analyst Damu Balaji : జైల్లో భాస్కర్ రెడ్డితో పైరవీలు… ఏపీ పోలీసుల నుండి తెలంగాణ జైలుకి పైరవీలు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా చంపింది ఎవరనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎంకి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలియక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్, ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. తాజాగా అవినాష్ రెడ్డి కి హై కోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే జైల్లో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి వద్దకు ఏపీ నుండి పైరవీలు జరుగుతున్నాయంటూ తాజాగా కథనం రావడం దాని గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ఏపీ నుండి తెలంగాణ కు పైరవీలు…

భాస్కర్ రెడ్డి గారు తెలంగాణ జైల్లో ఉన్నా ఆయనకు అన్ని వసతులు అందుతున్నాయని పైగా ఏపీ పోలీసులు ఏదైనా పని జరిపించుకోవాలంటే అక్కడి నుండి తెలంగాణ పోలీసుల ద్వారా భాస్కర్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నట్లు అందుకు బదులుగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కొన్ని మీడియల్లో కథనాలు వెలువడటం గురించి అనలిస్ట్ దాముబాలాజీ మాట్లాడుతూ అక్కడి నుండి ఇక్కడికి సిఫార్సులు, పైరవీలు జరగాల్సిన పనిలేదు.

అదీకాక జగన్ తనకు జైల్లో ఉన్నపుడు తనని బాగా చూసుకున్న అధికారికి తాను బయటికి వచ్చాక మంచి పొజిషన్ లో పెట్టారని, ఆయన ద్వారా ఇప్పుడు ఇక్కడి ఆఫీసర్స్ తో మాట్లాడి భాస్కర్ రెడ్డికి సదుపాయలను ఏర్పాట్లు చేస్తున్నారన్నది కూడా అవాస్తవం అంటూ చెప్పారు. ఎక్కడైనా జైల్లో ఉన్నవారు డబ్బు ఇస్తే అన్ని వసతులు కల్పిస్తారు. ఇంత చిన్న విషయానికి జగన్ ఇక్కడి అధికారులతో మాట్లాడాల్సిన పని లేదు అంటూ చెప్పారు బాలాజీ.